హాలీవుడ్ కి చెందిన నటి పమేలా ఆండర్సన్‌ తన విడాకుల వ్యవహారంతో మరోసారి వార్తల్లోకెక్కింది. ఇటీవల ఈమె పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి రెడీ అయిందట. దీనికి ఈమె భర్త కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

కేవలం పెళ్లైన 12 రోజుల్లోనే వీరి విడిపోతుండడం ఆశ్చర్యంగా ఉంది. ఇంకా వీరి పెళ్లి సర్టిఫికేట్ కూడా రాలేదు. ఇంతలోనే విడిపోతుండడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 52 ఏళ్ల వయసున్న పమేలా.. 72 ఏళ్ల వయసున్న జాన్ పీటర్స్ అనే వ్యక్తిని రెండు వారాల క్రితం పెళ్లి చేసుకుంది.

ఒకప్పటి హిట్టు హీరోయిన్.. @40లో హీటెక్కిస్తోంది

ఇంతలోనే వీరు విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయంపై పమేలా వివరణ ఇస్తూ.. 'జీవితంలో ఒకరి నుండి ఒకరం ఏం కోరుకుంటున్నామనేది తెలుసుకోవడం ముఖ. అందుకే ఈ విషయంపై స్పష్టత కోసమే కొంతకాలం దూరంగా ఉండాలని మేం నిర్ణయించుకున్నామని' చెప్పుకొచ్చింది.

వీరి ప్రేమ ఇప్పటిది కాదు.. ముప్పై యేళ్ల కింద‌ట కొన్నాళ్ల పాటు వీరు డేటింగ్ చేశార‌ట‌. ఆ తరువాత విడిపోయారు. పమేలాకి ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు జరిగాయి. మొదట ముగ్గురు భర్తలతో విడాకులు తీసుకోగా.. ఇప్పుడు తన నాలుగో భర్త జాన్ పీటర్స్ తో విడిపోవడానికి సిద్ధమవుతోంది.