ఒకప్పటి హిట్టు హీరోయిన్.. @40లో హీటెక్కిస్తోంది
ఒకప్పుడు క్యూట్ గా అమాయకంగా కనిపిస్తూ తెలుగు జనాల్లో మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ ఎవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అనితా హంసానందిని. ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ భామని ఇప్పుడిలా చూస్తే.. ఎవరైనా సరే ఒకప్పటి నువ్వు నేను హీరోయిన్ అనుకోలేరు.
2001లో వచ్చిన 'నువ్వు నేను' సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమాతోనే అనిత సినీ కెరీర్ ఊపందుకుంది.
వరుసగా అవకాశాలు అందుకుంటూ తెలుగు తమిళ్ హిందీ కన్నడ అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటించింది.
అయితే ఎన్ని సినిమాలు చేసిన బేబీ స్టార్ హీరోలతో మాత్రం పెద్దగా స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయింది.
హిందీ సీరియల్స్, రియాల్టీ షోలు అంటూ.. ఎదో కెరీర్ ని నెట్టుకొస్తోంది.
ప్రస్తుతం హిందీ సీరియల్ నాగిని 4 లో నటిస్తోంది.
38 ఏళ్ల అనిత 40లోకి వస్తున్నా కూడా ఇంకా అదే అందంతో నెటిజన్స్ ని ఆకర్షిస్తోంది.