పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో 'పింక్' రీమేక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు వేణుశ్రీరాం ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కావాల్సిన అన్నీ బాగానే సమకూరాయి కానీ ఇంకా హీరోయిన్ మాత్రం సెట్ కాలేదు. మొదట పూజాహెగ్డేని తీసుకుందామని అనుకున్నారు.

అయితే డైరెక్టర్ క్రిష్ చేస్తోన్న సినిమా కూడా ఉంది. అందులో కూడా పవన్ కి హీరోయిన్ కావాలి. అందుకోసం పూజా హెగ్డే పేరు పరిశీలనలో ఉంది. ఆ సంగతి అలా ఉంటే 'పింక్'కి హీరోయిన్ గా ఎవరు సెట్ అవుతారనే పాయింట్ అలాగే ఉంది. కథ ప్రకారం 'పింక్' రీమేక్ లో హీరోయిన్ ఓ బిడ్డకి తల్లిగా కనిపించనుందట.

పవన్ కళ్యాణ్ కు జోడీగా ఫ్లాప్ హీరోయిన్ ?.. క్రిష్ డైరెక్షన్ లో పీరియాడిక్ ఫిల్మ్!

మరి బిడ్డకు తల్లి అనే వయసున్న క్యారెక్టర్ ని చేయడానికి ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఎవరు రెడీగా ఉంటారనే సందేహాలు కలుగుతున్నాయి. ఎంత పవన్ స్టార్ అయినా, దిల్ రాజు బ్యానర్ అయినా.. మన హీరోయిన్లు బిడ్డ తల్లిగా చేయడానికి కచ్చితంగా ఆలోచిస్తారు. పైగా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా తక్కువ అని తెలుస్తోంది.

అందుకే హీరోయిన్ గా ఎవరు దొరుకుతారనే ఆలోచనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో 'మళ్లీ రావా', 'దేవదాస్' సినిమాల్లో నటించిన హీరోయిన్ ఆకాంక్ష సింగ్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

కానీ ప్రాజెక్ట్ కి క్రేజ్ పెరగాలంటే కాస్త పేరున్న హీరోయిన్ కావాలి. రకుల్ ప్రీత్ సింగ్ ఒప్పుకుంటుందా..? అనే ఆలోచన కూడా దిల్ రాజుకి ఉన్నట్లు తెలుస్తోంది. మరి పవన్ కి హీరోయిన్ గా ఎవరు సెట్ అవుతారో చూడాలి!