ఆర్ఎక్స్ 100 చిత్రంతో కార్తికేయ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల కార్తికేయ 90 ఎమ్ ఎల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తికేయ యువతని ఆకర్షించేలా కథలు ఎంచుకుంటున్నాడు. కానీ ఆర్ఎక్స్ 100 తర్వాత అంతటి సక్సెస్ లభించలేదు. 

కార్తికేయ నటనకు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో కార్తికేయ విలన్ గా నటించి మెప్పించాడు. తాను ఎలాంటి ప్రయోగానికైనా సిద్దమే అని కార్తికేయ ఈ మూవీ ద్వారా సంకేతాలు ఇచ్చాడు. తాజాగా కార్తికేయ తదుపరి చిత్రాలకు సంబంధించిన ఆసక్తికర ప్రచారం మొదలయింది. 

మహేష్, వంశీ పైడిపల్లి మూవీ.. రంగంలోకి దిగిన బాలీవుడ్ సంస్థ?

మరోమారు కార్తికేయ విలన్ గా నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా తమిళ స్టార్ హీరో అజిత్ చిత్రంలో. హెచ్ వినోద్ దర్శత్వంలో అజిత్ తదుపరి చిత్రం ఉండబోతోంది.ఈ చిత్రానికి 'వాలిమై' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో విలన్ పాత్ర వైవిధ్యంగా ఉండడం కోసం దర్శకుడు కార్తికేయని సంప్రదించినట్లు తెలుస్తోంది. 

పవన్ 'పింక్' రీమేక్.. లోకల్ పిల్లకి బంపర్ ఆఫర్

స్టైలిష్ గా ఉంటూనే గ్యాంగ్ లీడర్ చిత్రంలో కార్తికేయ విలనిజాన్ని పండించాడు. ఆ తరహా నటనే వాలిమై చిత్రానికి కూడా అవసరం కానుండడంతో దర్శకుడు కార్తికేయని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.