బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కీచకపర్వాలు కొనసాగుతున్నాయి. 2018లో నటి తనుశ్రీ దత్తా మొదలు పెట్టిన మీటూ ఉద్యమం జాతీయ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. తనుశ్రీ దత్తా ఇచ్చిన ధైర్యంతో చాలా మంది నటీమణులు తమపై చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులని బయట పెట్టారు. దీనితో కొందరు బాలీవుడ్ దర్శకులు, నటులు, నిర్మాతల బండారాలు బయట పడ్డాయి. 

ఇప్పటికి చాలా మంది నటీమణులు, చిత్ర పరిశ్రమకు చెందిన మహిళా టెక్నీషియన్లు తమపై జరుగుతున్న వేధింపుల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

ఇటీవల 33 ఏళ్ల మహిళా డాన్సర్ గణేష్ ఆచార్య తనని లైంగికంగా వేధిస్తున్నట్లు, దాడికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. తాజాగా మరో మహిళ గణేష్ ఆచార్యపై మరో మహిళా డాన్సర్.. మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన 90వ దశకంలో జరిగిందని పేర్కొంది. ఆ సమయంలో తనకు 18 ఏళ్ల వయసు అని ఆమె తెలిపింది. 

పవన్ హీరోయిన్ కి ఆఫర్స్ లేవు.. అయినా లగ్జరీ కారు కొనేసింది చూశారా!

లైవ్ డాన్స్ క్లాసుల పేరుతో గణేష్ ఆచార్య నన్ను ఓ హోటల్ కు పిలిచాడు. ఆ సమయంలో నేను నాన్ మెంబర్ డాన్సర్ గా పని చేశా. హోటల్ కు పిలిచిన అతడు అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెబుతూ శరీరాన్ని తాకడం మొదలు పెట్టాడు. బ్రతిమలాడినా వినిపించుకోలేదు. చివరకు తాను పీరియడ్స్ లో ఉన్నానని చెప్పడంతో విడిచిపెట్టినట్లు ఆమె మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేసింది. 

బ్లాక్ డ్రెస్ లో 'ఎఫ్ 2' హీరోయిన్ ఫోజులు.. సమ్మోహన పరిచే అందం!

వరుసగా నమోదవుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో గణేష్ పై విమర్శలు ఎదురవుతున్నాయి. గణేష్ ఆచార్యని బాలీవుడ్ నుంచి బహిష్కరించాలని హీరోయిన్ తనుశ్రీ దత్తా డిమాండ్ చేస్తోంది.