హీరో హీరోయిన్స్ మధ్య డేటింగ్ అనేది బాలీవుడ్ లో కామన్ అని అందరికి తెలిసిన విషయమే. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడిపుడే ఆ డేటింగ్ గాలి ఎక్కువతున్నప్పటికీ నార్త్ సెలబ్రెటీలను డామినేట్ చేసేంతగా ఎవరు డేరింగ్ డేటింగ్ చేయడం లేదు. అసలు విషయంలోకి వస్తే ఇటీవల కృతి ఖర్బందా డేటింగ్ విషయం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

రూమర్స్ కి తావివ్వకుండా అమ్మడు ముందే తన డేటింగ్ విషయాన్నీ బహిరంగంగా చెప్పేసింది. 'సనమ్ రే' ఫేమ్ పుల్కిట్ సామ్రాట్ తో ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నామని ప్రకటించిన అమ్మడికి ఇప్పుడు ప్రైవసి దొరకడం లేదట. ఇందులో దాయడానికి ఏముంది. రూమర్స్  రాకముందే మేమె ఆ విషయాన్నీ బయటపెట్టం కదా.. అయినప్పటికీ రకరకాల పుకార్లు ఇంకా ఎందుకు పుట్టించడం? మా పర్సనల్ లైఫ్ మమ్మల్ని బ్రతకనివ్వండి అంటూ కృతి ఇటీవల మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చింది.

శ్రీను వైట్ల హైబడ్జెట్ మూవీ.. హీరో ఎవరో తెలుసా?

అలాగే హీరో పుల్కిట్ కూడా అదే తరహాలో స్పందించాడు. తమ కుటుంబ సభ్యులకు ఇలాంటివి నచ్చవని, కెమెరా ముందు వ్యక్తిగత జీవితాన్ని ఉంచడం ఇరు కుటుంబ సబ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదని అందుకే తమకు కాస్త ప్రైవసి ఇవ్వండని కోరాడు. దీంతో మరోసారి ఈ వార్త ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత 'బోణీ' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ 'తీన్మార్' సినిమా నటించే ఛాన్స్ దక్కించుకొని కాస్త క్రేజ్ తెచ్చుకుంది. కానీ సినిమా నిరాశ పరచడంతో ఆమెకి అవకాశాలు లేకుండా పోయాయి. 

'బ్రూస్ లీ' సినిమాలో చరణ్ కి అక్క పాత్రలో నటించి ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో కనిపించలేదు. బాలీవుడ్ పై దృష్టి పెట్టిన ఈ బ్యూటీ అక్కడ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇటీవల అక్షయ్ కుమార్ నటించిన 'హౌస్ ఫుల్ 4' సినిమాలో నటించింది. అలానే 'పాగల్ పంతీ' అనే సినిమాకి గ్రాన్ సిగ్నల్ ఇచ్చింది.