చిన్మయి ప్రియదర్శిని నాయక అనే ఒడియా సినీ నటి తనను మోసగించినట్లు కటక్-భువనేశ్వర్ జంట నగరాల పోలీస్ కమిషనర్ వద్ద వైజాగ్ కి చెందిన పద్మరాజు రవికుమార్ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు.

ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఆమె తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిందని రవికుమార్ ఆరోపిస్తున్నాడు. తన వద్ద నుండి ల్యాప్ టాప్, రూ.2 లక్షల నగదు, ఒక బంగారు గొలుసు తీసుకొని తనను మోసగించిందని అంటున్నాడు. దీనిపై స్పందించిన చిన్మయ బుధవారం భువనేశ్వర్ లో మీడియాతో మాట్లాడారు.

మహేష్, అల్లు అర్జున్ మధ్య నలిగిపోతున్న దిల్ రాజు.. లిస్ట్ కూడా రెడీ!

తాను ఎవరినీ మోసం చేయలేదని చెప్పారు. రవికుమార్ తనకు ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడని.. మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకుంటూ తనతో స్నేహం పెంచుకున్నాడని చెప్పారు. ఆయన రాష్ట్రానికి వచ్చినప్పుడు మర్యాదలు చేశానని.. డబ్బులకు ఇబ్బందిగా ఉందని చెప్పడంతో రూ.1.50 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు చెప్పింది.

అందులో యాభై వేలు తిరిగి ఇచ్చిన అతడు మిగిలిన డబ్బు ఇంకా ఇవ్వలేదని చెప్పారు. తనను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడని.. దీనికి తాను తిరస్కరించి స్నేహితులుగానే ఉందామని చెప్పడంతో ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిపింది. కావాలనే తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని చెప్పుకొచ్చింది.