టాలీవుడ్ స్టార్ హీరోలు తమకంటూ సొంత వ్యాపారాలు పెట్టుకుంటున్నారు.ఒకరు థియేటర్ బిజినెస్, మరొకరు షాపింగ్ మాల్స్, ఇంకొకరు బంగారుదుకాణాలు ఇలా ఒక్కొక్కరూ ఒక్కో వ్యాపారంలో తమ సత్తా చాటుతున్నారు. కొందరు హీరోలు సొంతంగా బ్యానర్ మొదలుపెట్టి సినిమాలు నిర్మించడంమొదలుపెట్టారు.

ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండలాంటి హీరోలు నిర్మాతలుగా రాణిస్తున్నారు. మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థను స్థాపించి.. తన చిత్రనిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు. యూవీ క్రియేషన్స్ ప్రభాస్ సొంత బ్యానర్ లాంటిది.

బన్నీ విషయంలో ఫెయిల్.. మరి చరణ్ తో ఓకే అనిపించుకుంటాడా..?

కుర్ర హీరో విజయ్ దేవరకొండ కూడా నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఎన్టీఆర్ కూడా చేరబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థని స్థాపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యామిలీ 'ఎన్టీఆర్ ఆర్ట్స్' అనే నిర్మాణ సంస్థ ఉంది.

దీని బాధ్యతలు కళ్యాణ్ రామ్ చూసుకుంటున్నాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఓ బ్యానర్ మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. మహేష్ బాబులానే తన సినిమాల నిర్మాణంలో పాలు పంచుకునే దిశగా ఎన్టీఆర్ అడుగులు వేయబోతున్నట్లు సమాచారం. మంచి రోజు చూసుకొని నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో ఎన్టీఆర్ స్పందించే వరకు ఎదురుచూడాల్సిందే. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో 'RRR' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.