మెగా హీరోలతో సినిమా చేయడమంటే అంత ఈజీ కాదు.. ముందుగా హీరోని ఒప్పించాలి.. ఆ తరువాత అల్లు అరవింద్ లాంటి పెద్దల జోక్యం ఉంటుంది. మరీ పెద్ద ప్రాజెక్ట్ అంటే విషయం చిరు వరకు తీసుకెళ్లి ఓకే చేయించుకోవాలి. దర్శకులకు ఇది పెద్ద టాస్క్ అనే చెప్పాలి.

గతంలో విక్రమ్ కె కుమార్.. అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి చాలా ప్రయత్నాలే చేశాడు. 'నా పేరు సూర్య'కి ముందు విక్రమ్ తో బన్నీ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఆఖరి నిమిషంలో ప్రాజెక్ట్ చేజారడంతో విక్రమ్.. నానితో సినిమా తీశాడు.

సాహో ఎఫెక్ట్: బడ్జెట్ లో ప్రభాస్ కండిషన్స్

వీరి కాంబినేషన్ లో వచ్చిన 'గ్యాంగ్ లీడర్' మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు మరోసారి మెగాహీరోతో సినిమా చేయాలని భావిస్తున్నాడు విక్రమ్ కుమార్. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఓ స్టోరీలైన్ కూడా వినిపించాడు. చరణ్, విక్రమ్ ల మధ్య ఇప్పటికే ఓ సిట్టింగ్ కూడా జరిగింది. కేవలం లైన్ గా కాకుండా.. కాస్త డెప్త్ గానే చరణ్ కి కథ వినిపించాడట విక్రమ్ కుమార్.

అయితే రామ్ చరణ్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ మధ్యకాలంలో హీరోలు బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా సినిమాలు ఒప్పుకోవడం లేదు. కాబట్టి చరణ్ కూడా బౌండెడ్ స్క్రిప్ట్ అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ చరణ్ కి నచ్చినా.. చిరంజీవిని కూడా ఒప్పించాల్సి ఉంటుంది.

బన్నీ విషయంలో ఫెయిల్ అయిన విక్రమ్.. చరణ్ తో ప్రాజెక్ట్ ఓకే చేయించుకుంటాడో లేదో చూడాలి. ప్రస్తుతం చరణ్.. రామ్ చరణ్ రూపొందిస్తోన్న 'RRR' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయాలని భావిస్తున్నారు.