Asianet News TeluguAsianet News Telugu

బన్నీకి కళ్యాణ్ రామ్ థాంక్స్.. గోలలో కూడా ఆ మాట మరచిపోని ఎన్టీఆర్!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా చిత్రం జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

NTR Speech at Entha manchivadavuraa pre release event
Author
Hyderabad, First Published Jan 8, 2020, 9:24 PM IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా చిత్రం జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. కళ్యాణ్ రామ్ కి జోడిగా ఈ చిత్రంలో మెహ్రీన్ నటించింది. 

నేడు(బుధవారం) హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. తన సోదరుడి చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఎన్టీఆర్ హాజరు కావడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. 

అభిమానుల కేరింతల నడుమ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎక్కువ సేపు ప్రసంగించడం సాధ్యం కాలేదు. తాను చెప్పాలనుకున్న విషయం చెప్పి ఎన్టీఆర్ త్వరగా తన ప్రసంగాన్ని ముగించాడు. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున గోల చేస్తుండడంతో కాస్త ఎన్టీఆర్ అసహనానికి గురయ్యాడు. మీరు సైలెంట్ గా ఉంటే మాట్లాడుతా లేకుంటే వెళ్ళిపోతా అని ఎన్టీఆర్ అనడంతో అభిమానులు కాస్త శాంతించారు. 

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కళ్యాణ్ రామ్ అన్న కమర్షియల్, థ్రిల్లర్ లాంటి విభిన్నమైన జోనర్స్ లో నటించాడు. కానీ నాకు ఒక వెలితి ఉండేది. కళ్యాణ్ అన్న మంచి కుటుంబ కథా చిత్రంలో నటిస్తే బావుంటుంది అనుకునేవాడిని. ఆ కోరిక దర్శకుడు సతీష్ వేగేశ్నగారు తీరుస్తున్నారు. ఈ చిత్రం విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని ఎన్టీఆర్ వ్యక్తపరిచాడు. 

సంక్రాంతికి రిలీజ్ అవుతున్న దర్బార్, అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపాడు. మరోసారి ఎన్టీఆర్ అభిమానులపై తన ప్రేమని చాటుకున్నాడు. ఆ గోలలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు జాగ్రత్తలు తెలిపాడు. ప్రతి ఒక్కరూ ఇంటికి క్షేమంగా వెళ్ళాలి.. ఇదే ఉత్సాహాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలని కోరాడు. 

'ఎంత మంచివాడవురా' ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ చేతుల మీదుగా!

అంతకు ముందు కళ్యాణ్ రామ్ ప్రసంగిస్తునప్పుడు కూడా ఫ్యాన్స్ కేరింతలు ఆగలేదు. దీనితో కళ్యాణ్ రామ్ కూడా తన ప్రసంగాన్ని త్వరగా ముగించాడు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ అల్లు అర్జున్ కు కృతజ్ఞతలు తెలిపాడు. అల వైకుంఠపురములో చిత్ర మ్యూజిక్ కన్సర్ట్ లో అల్లు అర్జున్ ఎంత మంచి వాడవురా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios