యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని వెండితెరపై చూడడం కోసం అభిమానులకు 2018 నుంచి ఎదురుచూపులు తప్పడం లేదు. ఎన్టీఆర్ చివరగా నటించిన అరవింద సమేత చిత్రం 2018లో విడుదలయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కించే ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీ అయిపోయాడు. ఆర్ఆర్ఆర్ మూవీ 2020లో రిలీజ్ అవుతుందని అంతా భావించాలరు. కానీ ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

దీనితో ఎన్టీఆర్ కెరీర్ లో 2019, 2020 ఖాళీగా మిగిలిపోయాయి. ఇక అప్పుడప్పుడూ వచ్చే ఆర్ఆర్ఆర్ అప్డేట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సరిపెట్టుకుంటున్నారు. రాజమౌళి ఇంతవరకు ఎన్టీఆర్, చరణ్ ల లుక్ కూడా రివీల్ చేయలేదు. దీనితో బయట ఈవెంట్ లో ఎక్కడైనా ఎన్టీఆర్ కనిపిస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. తాజాగా ఎన్టీఆర్ తన కుటుంబంతో ట్విట్టర్ లో మెరిసి అభిమానులని ఖుషి చేశాడు. 

హోలీ సందర్భంగా ఫ్యాన్స్ కు విషెష్ తెలియజేస్తూ భార్య లక్ష్మి ప్రణతి.. కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో ఉన్న ఫోటోని షేర్ చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఎన్టీఆర్ తనయులు ఇద్దరూ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు. 

హోలీ స్పెషల్.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్ వైరల్!

ఇదిలా ఉండగా దర్శకుడు హరీష్ శంకర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్ లో ఓ ప్రత్యేక విషయాన్ని గమనించారు. ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ లుక్ పై కామెంట్స్ చేశాడు. 'ఆ చిన్నోడు కెమెరా వంక చూస్తున్న విధానం ఓ ప్రత్యేక విషయాన్ని తెలియజేస్తోంది. వదిలితే దూకేసేలా ఉన్నాడు' అని హరీష్ కామెంట్స్ చేశాడు. 

భార్గవ్ రామ్ ని చూస్తుంటే అని నిజమే అనిపిస్తోంది. రెండేళ్లు కూడా నిండని ఆ బుడతడు కెమెరాని పేస్ చేయడం బాగా లావాటైనట్లు చాలా చక్కగా ఫోజు ఇచ్చాడు. ఈ విషయం గురించి హరీష్ ప్రత్యేకంగా చెప్పారు. హరీష్, ఎన్టీఆర్ కాంబోలో రామయ్యా వస్తావయ్యా చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.