Asianet News TeluguAsianet News Telugu

పాత బంగారం: సెంటిమెంట్ గా...రెండో సారి 'నిక్కరు' తో ఎన్టీఆర్

సారధి స్టూడియోస్ నిర్మించిన ఆత్మబంధువు చిత్రం 1962, డిసెంబర్ 14న విడుదలై ఘన విజయం సాధించింది. శివాజీ గణేశన్, షావుకారు జానకి, జంటగా నటించిన ఈ తమిళ సినిమా దర్శకుడు ఎ.భీమ్ సింగ్ , అదే  పాత్రలను తెలుగులో ఎన్ టి రామారావు, సావిత్రి, ఎస్ వి రంగారావు ప్రధాన తారాగణంతో చేసారు. 

NTR again with knicker in Aathama Bandhuvu movie
Author
Hyderabad, First Published Nov 20, 2019, 9:43 AM IST

సినిమావాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ...ఒక సినిమాలో ఒక విషయం హిట్టైతే...తర్వాత సినిమాలో దాన్ని రిపీట్ చేయటానికి ప్రయత్నిస్తూంటారు. ఇది ఈనాటి మాట కాదు.. సినిమా పరిశ్రమ పుట్టిన నాటి నుంచి నడుస్తున్న విషయమే. దర్శక,నిర్మాతల సెంటిమెంట్స్ ని హీరోలు గౌరవించేవారు. అలాగే నందమూరి తారక రామారావు.. గుండమ్మ కథ సినిమాలో నిక్కరుతో నటిస్తే హిట్టైందని...ఆ తర్వాత నిక్కరను మరో సినిమాలో కంటిన్యూ చేసారు. ఆ విశేషాలు చూద్దాం.

సారధి స్టూడియోస్ నిర్మించిన ఆత్మబంధువు చిత్రం 1962, డిసెంబర్ 14న విడుదలై ఘన విజయం సాధించింది. శివాజీ గణేశన్, షావుకారు జానకి, జంటగా నటించిన ఈ తమిళ సినిమా దర్శకుడు ఎ.భీమ్ సింగ్ , అదే  పాత్రలను తెలుగులో ఎన్ టి రామారావు, సావిత్రి, ఎస్ వి రంగారావు ప్రధాన తారాగణంతో చేసారు. ఈ చిత్రం నిర్మాణ సమయంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

బాలకృష్ణ - బోయపాటి కాంబో.. ఇంట్రెస్టింగ్ అప్డేట్!

అదే సంవత్సరం జూలైలో రిలీజైన గుండమ్మ కథ చిత్రంలో ఎన్టీఆర్ నిక్కరు ధరించిన సన్నవేశాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఈ చిత్రంలో కూడా ఎన్టీఆర్ కు నిక్కరు వేసి 'చీరగట్టి సింగారించి చింపి తలకు చిక్కు తీసి చక్కదనముతో సవాలు చేసే చుక్కలాంటి చిన్నదాన' అనే పాటను చిత్రీకరించారు. రెండోసారి కూడా ఎన్టీఆర్ ని నిక్కరులో చూసిన జనం ఈ విషయమై తెగ మాట్లాడుకున్నారు. ఆదరించారు. అంతేకాదు మరో పాటలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడుగా నటించి మెప్పించారు. అయితే ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ..సారధివారు తీసిన ఏ చిత్రంలోనూ చెయ్యలేదు.

ఈ సినిమాలో ఎస్వీ రంగారావు మొదట కుమారుడుగా సారధి వారి రోజులు మారాయి చిత్రంలో నటించిన వల్లం నరసింహారావు నెగిటివ్ రోల్ లో కనిపిస్తారు. అలాగే ఆయన రెండవ కుమారుడుగా ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కనిపిస్తారు.

ఇక సారధి వారి అంతా మనవాళ్లే, రోజులు మారాయి, కుంకుమ రేఘ, భాగ్య దేవత చిత్రాలకు చాణక్య డైరక్షన్ చేసారు. కానీ ఈ ఆత్మ బంధువు విషయానికి వచ్చేసరికి అదే బ్యానర్ పై చేసినా ఆయనకు అవకాసం ఇవ్వలేదు. భానుమతి భర్త దర్శకుడు భరణి రామకృష్ణకు అప్పచెప్పారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట భానుమతిని అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోవటం వల్ల సావిత్రిని తీసుకున్నారు. ఇలా ఈ సినిమా గురించి అప్పట్లో జనం మాట్లాడుకునే చాలా విషయాలు జరిగాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios