నందమూరి అభిమానులకు ఈ మధ్య బాలకృష్ణ తన లుక్స్ తో సరికొత్త కిక్ ఇస్తున్న విషయం తెలిసిందే. కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త సినిమా రూలర్ తో రాబోతున్న బాలకృష్ణ కథకు తగ్గట్టుగా తనను తాను చాలా మార్చుకున్నాడు. లుక్స్ పరంగానే కాకుండా ఫిట్ నెస్ లో కూడా చాలా మార్పులు తెచ్చుకున్న బాలయ్య బాబు అభిమానులకు సరికొత్త కిక్ ఇవ్వబోతున్నట్లు అర్ధమవుతోంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. రూలర్ షూటింగ్ పనులు అయిపోగానే బాలకృష్ణ బోయపాటి శ్రీను ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయనున్నాడు. గత కొంత కాలంగా ఈ హిట్ కాంబినేషన్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. బడ్జెట్ కారణంగా బోయపాటి ఇన్ని రోజులు ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తేలేకపోయాడు. కొన్ని చర్చల అనంతరం బడ్జెట్ లిమిట్స్ లో మార్పులు చేయడంతో ఫైనల్ గా సినిమా చేయడానికి రెడీ అయ్యారు.

గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా - లెజెండ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే.  ఇక ముడవసారి కూడా వీరి కాంబినేషన్స్ తెరపైకి వస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఫైనల్ గా సినిమాను డిసెంబర్ 7న లాంచ్ చేయాలనీ దర్శకనిర్మాతలు డేట్ ఫిక్స్ చేసుకున్నారు.

ఒక్క డిజాస్టర్ ఎంత పని చేసింది.. బాలయ్యతో మూవీ..బోయపాటి పరిస్థితి ఇదీ!

ప్రీ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమా టైటిల్ ని కూడా ముందే రివీల్ చేయాలనీ బోయపాటి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్స్ తో మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాడని టాక్ వస్తోంది. ఇక రూలర్ సినిమా క్రిస్మస్ కి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.