ప్రస్తుతం కమర్షియల్ చిత్రాల్లో ఐటెం సాంగ్స్ భాగమైపోయాయి. ఐటెం సాంగ్స్ కోసమే ప్రత్యేకంగా దర్శకుడు కొందరు ముద్దుగుమ్మలని ఎంచుకుంటుంటారు. ఒకప్పుడు టాలీవుడ్ ఐటెం సాంగ్స్ అంటే ముమైత్ ఖాన్ గుర్తుకు వచ్చేది. ఆమె హవా తగ్గిన తర్వాత చాలా మంది నటీమణులు ఐటెం సాంగ్స్ చేస్తున్నారు. అవసరమైతే స్టార్ హీరోయిన్లే ఐటెం బ్యూటీలుగా మారిపోతున్నారు. 

ప్రస్తుతం నోరా ఫతేహి సెన్సేషనల్ డాన్సర్ గా మారిపోయింది. దక్షణాది చిత్రాలతో పాటు బాలీవుడ్ లో కూడా నోరా ఫతేహి అవకాశాలు అందుకుంటోంది. శుక్రవారం రోజు వరుణ్ ధావన్, శ్రద్దా కపూర్ నటించిన స్ట్రీట్ డాన్సర్ 3డి విడుదలయింది. ఈ చిత్రంలో నోరా ఫతేహి కూడా నటించింది. 

ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ఓ సాంగ్ కోసం నోరా ఫతేహి పోనీ టైల్ హెయిర్ స్టైల్ లో కనిపించాలి. శ్రద్దా కపూర్, నోరా ఫతేహి కలసి పోటా పోటీగా డాన్స్ చేసే సన్నివేశం ఉందట. ఆ సన్నివేశం కోసం పోనీటైల్ పొడవుగా, ఒత్తుగా ఉండాలని భావించారు. అనుకున్నట్లు హెయిర్ స్టైల్ రావడానికి చిత్ర యూనిట్ నోరా ఫతేహి కోసం అక్షరాలా రూ 2.5 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 

బ్లాక్ డ్రెస్ లో వరుణ్ హీరోయిన్.. సెక్సీ చూపులు, వేడెక్కించే అందాలు!

నోరా ఫతేహి గతంలో ఎన్టీఆర్ టెంపర్, ప్రభాస్ బాహుబలి చిత్రాల్లో కూడా ఐటెం సాంగ్స్ చేసింది. శరీరాన్ని మెలికలు తిప్పుతూ ఎలాంటి భంగిమలో అయినా డాన్స్ చేయగల నైపుణ్యం నోరాఫతేహి సొంతం. అలాంటి డాన్సర్ కోసం ఎంత ఖర్చు చేసినా పర్వాలేదు అని నెటిజన్లు అంటున్నారు. 

మెగాస్టార్ 'సైరా'కు దెబ్బ పడింది.. కారణం అదే అంటున్నారు!