ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ గనుక ఫిక్స్ చేయకపోతే ఆ డేట్ కి రావాలని ప్లాన్ చేసుకుంటున్న చిన్న సినిమాలకు ఆ పెద్ద సినిమా సమస్య మారుతుంది. ఆ డేట్ కి సినిమా వస్తుందనే టాక్ తో చిన్న సినిమా నిర్మాతలు టెన్షన్ పడుతూ ఉంటారు.

పెద్ద సినిమాలు రాని సమయం చూసుకొని సినిమా విడుదల చేయాలనుకునే నిర్మాతలకు రిలీజ్ డేట్స్ పై ఓ ఐడియా ఉంటుంది. కానీ వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తోన్న 'వెంకీ మామ' సినిమాపై మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా  నానుస్తున్నారు నిర్మాత సురేష్ బాబు.

అల్లు అర్జున్, మహేష్ బాక్సాఫీస్ వార్.. మధ్యలో మెగాస్టార్!

మరోపక్క సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఒక పాటను విడుదల చేశారు. అలానే రీసెంట్ గా టీజర్ కూడా వదిలారు. తాజాగా మరో పాట కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సినిమా కచ్చితంగా డిసంబర్ లో విడుదల అవుతుందని చాలా మంది భావిస్తున్నారు.

అయితే వస్తే డిసంబర్ 13న, వెంకటేష్ పుట్టినరోజు కానుకగా వస్తుందని లేదంటే డిసంబర్ 20 లేదా డిసంబర్ 25న ఏదొక డేట్ న వస్తుందని అనుకుంటున్నారు. కానీ ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. తమ చిత్రాలని ఎప్పుడు విడుదల చేసుకోవాలా అని ఐదారుగురు నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.

కానీ 'వెంకీమామ' మేకర్స్ కి ఇవేమీ పట్టవు కాబట్టి రిలీజ్ డేట్ విషయంలో సస్పెన్స్ మైంటైన్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. చైతు సరసన రాశిఖన్నా నటిస్తోంది. దర్శకుడు బాబీ రూపొందిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.