వివాదాలతోనే సినిమాకు క్రేజ్ తెచ్చి అమ్మేద్దా, విడుదల చేసేద్దాం అనే ఫంధాలో వెళ్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు తన స్టైల్ ఆఫ్ మేకింగ్, క్యారక్టరైజేషన్ లతో ఆసక్తి కలిగిస్తూ సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు అవన్నీ వదిలేసారు. కేవలం కక్ష సాధింపు సినిమాలు మొదలెట్టారు.అయితే ఎంత వివాదం రేపినా, బిజినెస్ కాకపోతే రిలీజ్ చేయటం కష్టం.

లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత ఆ శకం కూడా ముగిసేటట్లు కనపడుతోంది. అప్పుడు ఎలక్షన్స్ వేడిలో ఆ సినిమాని వదిలి క్యాష్ చేసుకున్న ఆయన ఇప్పుడు కులాల మధ్య చిచ్చు రేపుతూ చేసిన చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. అయితే ఈ సినిమా అనుకున్నంతగా వివాదాస్పదం కాలేదు. జనం లైట్ తీసుకున్నారు. దాంతో ఆ ఎఫెక్ట్ బిజినెస్ పై పడిందని సమాచారం.

వైఎస్ జగన్ పై నారాయణమూర్తి కామెంట్స్.. స్వాతంత్రం వచ్చాక ఇంతలా!

ఇప్పటికే విడుదల చేసిన ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’  ట్రైలర్‌ కొద్దిగా వివాదం అయితే రాజేసింది కానీ అంతకు మించి వార్తల్లో నిలవలేకపోయింది. టీడీపీ, వైకాపా పార్టీల పాలిటిక్స్, విజయవాడ రౌడీలు, హత్యా రాజకీయాలు..  చంద్రబాబు, జగన్, లోకేశ్‌, బ్రాహ్మణి, పవన్ కల్యాణ్, మోదీ, అమిత్ షా..  మరెందరో.. అధికారం కోసం ఒకరు, అధికారాన్ని కాపాడుకోడానికి మరొకరు పన్నే పన్నాగాలు, ప్యాకేజీలు, వెన్నుపోట్లు..మొత్తంగా ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని వర్మ  తీసుకొస్తున్నా అని చెప్తున్నా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ఉత్సాహంగా లేరు.  బిజినెస్ కాలేదని తెలుస్తోంది.

ఈ నెల 28 న రిలీజ్ డేట్ ఇచ్చినా  ప్రీ రిలీజ్ బిజినెస్, బజ్ లేకపోవటంతో వర్మలో కంగారు మొదలైందట. మరో ప్రక్క సెన్సార్...కులాల పేర్లను సినిమాలో ఉంచుతుందా అనే సందేహం కూడా ఉంది. కోర్టు రిలీజ్ కు స్టే ఇస్తే అడ్డుకుని ముందుకు తెచ్చేవాళ్లు కూడా లేరని, ఇలాంటి సినిమా జోలికి పోతే లాభం మాట తర్వాత  ఉన్న రూపాయి కూడా పోతుందని ట్రేడ్ లో వినపడుతోంది. మరి వర్మ ఈ సినిమా రిలీజ్ కోసం ఎలాంటి ట్రిక్ ప్లే చేస్తారో, ఏ వివాదం రాజేస్తారో చూడాలి.