ఐదు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి అఖండ విజయం సాధించింది. దీనితో జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించారు. జగన్ కు టాలీవుడ్ ప్రముఖుల నుంచి సరైన మద్దతు లభించడం లేదని కమెడియన్ పృథ్వి తరచుగా కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

వైఎస్ జగన్ కు టాలీవుడ్ లో క్రమంగా మద్దత్తు పెరుగుతోంది. పలువురు సినీ ప్రముఖులు స్వచ్చందంగా జగన్ ని అభినందింస్తున్నారు. కొందరు ఇప్పటికే వైసిపి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. విప్లవాత్మక భావజాలంతో, ప్రత్యేకమైన నటన శైలితో ఆర్ నారాయణ మూర్తి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. 

నారాయణ మూర్తి తెరకెక్కించిన చివరి చిత్రం మార్కెట్ లో ప్రజాస్వామ్యం. తాజాగా నారాయణమూర్తి ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన అద్భుతంగా ఉందని నారాయణమూర్తి అన్నారు. స్వాతంత్రం వచ్చాక ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని నారాయణమూర్తి ప్రశంసించారు. 

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా సామజిక న్యాయం కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. భారతదేశంలో 54 శాతం జనాభా బీసీలు ఉన్నారు. బీసీల రిజర్వేషన్ కోసం జగన్ చట్ట సభల్లో బిల్లు ప్రవేశపెట్టడం అభినందనీయం అని అన్నారు. 

రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో ఆర్ నారాయణ మూర్తికి సన్మానం జరిగింది. ఈ కారక్రమంలో నారాయణ మూర్తి జగన్ ని ప్రశంసించారు.