స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్ర అల వైకుంఠపురములో. విడుదలకు మూడు నెలల ముందు నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. సినిమాపై ప్రస్తుతం ఈ స్థాయిలో బజ్ ఏర్పడిందంటే అందుకు కారణం పాటలే. 

తాజాగా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో మరింతగా జోరు పెంచుతోంది. డిసెంబర్ 11న ఈ చిత్ర టీజర్ విడుదల కాబోతోంది. మాతల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రంలో ఎలాంటి మ్యాజిక్ చేయబోయితున్నాడనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఇదిలా ఉండగా తమిళ బ్యూటీ నివేత పేతురాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నివేత పేతురాజ్ అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అల్లు అర్జున్ మెరుపు వేగంతో డాన్స్ చేయగలడు. సినిమా కోసం బన్నీ ఎంతటి హార్డ్ వర్క్ అయినా చేస్తాడు. సెట్స్ లో నేను బన్నీని గమనించా. సన్నివేశం బాగా రావడం కోసం రిహార్సల్స్ చేస్తుంటాడు. 

పిక్ టాక్: మరో బోల్డ్ ఫోజుతో రెచ్చిపోయిన పూరి హీరోయిన్

ఇక డాన్స్ మూమెంట్స్ లో అతడి వేగాన్ని అందుకోవడం కష్టం. ఏరకంగా చూసిన అల్లు అర్జున్ ఓ ప్రత్యేకమైన వ్యక్తి అని నివేత పేతురాజ్ ప్రశంసల్లో ముంచెత్తింది. ఇక టాలీవుడ్ లో తన ప్రయాణం ఇప్పుడు మొదలైందని.. భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో నటిస్తానని తెలిపింది. ఇప్పటికి ఇప్పుడే ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలనే కోరిక తనకు లేదని నివేత పేర్కొంది. 

తెలుగులో నివేత పేతురాజ్ చిత్రలహరి, బ్రోచేవారెవరురా లాంటి చిత్రాల్లో నటించింది.