యంగ్ హీరో నితిన్ నటించిన భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నితిన్, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రష్మిక, నితిన్ మధ్య కెమిస్ట్రీ యువతని ఆకర్షించే విధంగా ఉంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ కు సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో భీష్మ చిత్ర థియేట్రికల్ హక్కులని రీజనబుల్ ధరలకే అమ్మారు. 

నైజాం ఏరియాలో థియేట్రికల్ రైట్స్ 4.5 కోట్లకు, ఆంధ్రలో 8 కోట్లకు, సీడెడ్ లో 2 కోట్లకు, ఓవర్సీస్ తో పాటు ఇతర ప్రాంతాల్లో 5.5 కోట్లకు భీష్మ చిత్ర హక్కులు అమ్ముడయ్యాయి. మొత్తంగా థియేట్రికల్ బిజినెస్ మొత్తం 20 కోట్ల వరకు జరిగింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్(శాటిలైట్, డిజిటల్) రూపంలో 15 కోట్ల వరకు నిర్మాతకు చేరాయి. 

విజయ్ హీరోయిన్ స్టన్నింగ్ హాట్ ఫొటోస్!

ఈ చిత్రాన్ని 25 కోట్ల బడ్జెట్ లోపే చిత్రీకరించారు. దీనితో భీష్మ చిత్ర నిర్మాతలు రిలీజ్ కు ముందే 10 కోట్ల లాభాన్ని చూశారు. సినిమాకు హిట్ టాక్ వస్తే అన్ని ప్రాంతాల్లో బయ్యర్లు మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంది. సోమవారం రోజు చిత్ర యూనిట్ హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 

'అహం బ్రహ్మాస్మి'.. హాట్ యాంకర్ తో మంచు మనోజ్ రొమాన్స్?