టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో హీరో నితిన్ ఒకరు. ఇప్పుడు ఈ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడని సమాచారం. సినిమా నేపధ్యంతో సంబంధం లేని, సంప్రదాయ రెడ్డి కుటుంబానికి చెందిన అమ్మాయిని నితిన్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

వధువు డాక్టర్ అని తెలుస్తోంది. మిగిలిన వివరాలు తెలియాల్సివున్నాయి. ఇది ఇలా ఉండగా.. నితిన్ కుటుంబం ఈ వివాహాన్ని దుబాయ్ లో చేయాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

స్టార్‌ కమెడియన్‌ అలీ ఇంట్లో విషాదం

నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ విషయాన్ని ఎలాంటి హడావిడి చేయకుండా.. తమ కుటుంబ వ్యవహారంగా ఉంచాలని భావిస్తున్నారు. అందుకే పెళ్లికూతురి వివరాలు బయటకి రాకుండా ఉంచారు. అయితే పెళ్లి డేట్ మాత్రం ఫిల్మ్ నగర్ చక్కర్లు కొడుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 15న పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

నితిన్ గతంలో ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటారని.. డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే గత కొంతకాలంగా ఇలాంటి వార్తలు కూడా తగ్గాయి. నితిన్ కూడా తన కెరీర్ మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం రష్మికతో కలిసి 'భీష్మ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి 'రంగ్ దే' సినిమా చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలతో పాటు చంద్రశేఖర్ ఏలేటి సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.