టాలీవుడ్‌ స్టార్ కమెడియన్‌, టెలివిజన్‌ హోస్ట్‌ అలీ తల్లి జైతున్‌ బీబీ అనారోగ్యంతో కన్నుమూశారు.రాజమహేంద్రవరంలోని ఆమె స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. వృధ్యాప్య సమస్యలతో గత కొద్ది రోజులుగా ఆమె రాజమండ్రిలోని హాస్పటిల్ లో చికిత్స తీసుకుంటున్నారు.

ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం జార్ఖండ్ లో ఉన్న అలీ.. తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. ఇక జైతున్ బీబీ భౌతిక కాయాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు తరలించినట్టు తెలుస్తోంది. గురువారం సాయంత్రం హైదరాబాద్ ‌లో జైతున్ అంత్యక్రియలు జరగనున్నట్టు సమాచారం.