నాలుగేళ్ళ క్రితం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ హీరో నితిన్, సమంత కాంబోలో వచ్చిన అందమైన చిత్రం అ..ఆ. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయంగా నిలిచింది. నితిన్, సమంత కెరీర్ లో ఈ చిత్రం ఒక మెమొరబుల్ మూవీ. 

తెలుగు చిత్రాలు ఇతర భాషల్లో విడుదలకావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కొన్ని పాన్ ఇండియా చిత్రాలు మాత్రమే నార్త్ లో విడుదలవుతుంటాయి. నితిన్ మార్కెట్ లోకల్ గానే కాబట్టి ఈ చిత్రాన్ని తెలుగులోనే రిలీజ్ చేశారు. తెలుగులో విజయం సాధించిన చిత్రాలకు నార్త్ లోమంచి డిమాండ్ ఉంది. 

'Ex'ల గురించి అలా చెప్పేవాళ్ళు సైకోలు.. త్రిష కామెంట్స్ రానా గురించేనా ?

అ.. ఆ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి హిందీ ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం యూట్యూబ్ లో 19 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుని 20 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. 

తాజాగా యూట్యూబ్ లో అ..ఆ చిత్రం సాధించిన రికార్డ్ ఏంటంటే.. 10 లక్షల లైకులు సొంతం చేసుకుంది. ఇది అరుదైన రికార్డ్. నితిన్ నటించిన చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం లాంటి చిత్రాల హిందీ డబ్బింగ్ కు కూడా మంచి స్పందన లభిస్తోంది.