యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. చలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించారు. అ..ఆ.. తర్వాత నితిన్ కు హిట్ లేదు. లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాసకల్యాణం చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. 

దీనితో భీష్మతో నితిన్ తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి నితిన్ అనుకున్నది సాధించాడు. భీష్మ హిట్ తో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. వెంకీ కుడుముల ఎలాంటి రిస్క్ చేయకుండా పక్కా కమర్షియల్ సబ్జెక్టుతో మెప్పించాడు. 

భీష్మ భీష్మ చిత్రం తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన లాభాల అందుకోవడం మొదలు పెట్టింది. ఇక 10 రోజులు ముగిసేసమయానికి ఈ చిత్రానికి మంచి వసూళ్లు నమోదయ్యాయి. అన్ని ఏరియాలలో బయ్యర్లు లాభాలు అందుకుంటున్నారు. 10 రోజుల్లో భీష్మ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 26.28 కోట్ల షేర్ రాబట్టింది. 

తెలుగు రాష్ట్రాల్లో భీష్మ చిత్రం 21.30 కోట్ల షేర్ రాబట్టింది. నైజాంలో 8.57 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.86 కోట్లు, సీడెడ్ లో 3.13 కోట్లు, వెస్ట్ గోదావరిలో 1.21, ఈస్ట్ లో1.64, గుంటూరులో 1.73, కృష్ణాలో 1.44, నెల్లూరులో 0.72 కోట్ల షేర్ ని భీష్మ చిత్రం రాబట్టింది. ఇక ఓవర్సీస్ బయ్యర్లు బాగా లాభపడ్డారు ఇప్పటికే ఈ చిత్రం యుఎస్ లో 1 మిలియన్ డాలర్ మార్క్ కు చేరువలో ఉంది. 

'అల వైకుంఠపురంలో' Netflix లో నెంబర్ వన్.. సంబరాల్లో ఫ్యాన్స్!

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికిసంగీత దర్శకుడు. ప్రస్తుతం నితిన్ ఇదే బ్యానర్ లో రంగ్ దే అనే మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు.