స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో వచ్చిన  మూడవ సూపర్ హిట్ చిత్రం “అల వైకుంఠపురంలో”. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మొన్న సంక్రాంతికి రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల మంచి ఆక్యుపెన్సీతో ఆడుతోంది. అలాగే తమన్ అందించిన పాటలు ఓ ట్రెండ్ ని క్రియేట్ చేసాయి. కలెక్షన్స్ పరంగా  రికార్డ్ లు క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇఫ్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఎంట్రీ ఇచ్చింది.

నేను ఫుల్లుగా మందు కొడతా..? అదేమైనా నేరమా..? హీరోయిన్ కామెంట్స్!

బాగా హైప్ ఇచ్చి మరీ సన్ నెక్ట్స్ యాప్ లో ఆ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టారు. అలాగే ఈ సినిమాని తాజాగా (పిబ్రవరి 26) నుంచీ నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమ్ చేసారు. ఈ విషయమై పబ్లిసిటీ చెయ్యకపోయినా ఈ వార్త దావానలంగా అంటుకుని,అభిమానులను నెట్ ప్లిక్స్ వైపు పరుగెలెత్తేలా చేసింది. తమ హీరో సినిమాని నెట్ ప్లిక్స్ స్ట్రీమింగ్ లో నెంబర్ వన్ గా చేయాలని వారు ఆలోచన నిజం అవటం మొదలెట్టింది. స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే టాప్ 10 ప్లేస్ లోకి వెళ్లింది. ఆదివారం నుంచి ఆ సినిమా ఇండియా టాప్ 10 మూవీస్ ఛార్ట్ లో చేరింది. ఆ తర్వాత ఆ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ సంపాదించింది.

అల్లు అర్జున్ కు నార్త్,సౌత్ అనే తేడా లేకుండా ఉన్న క్రేజ్ ని ఇది ఎలివేట్ చేసింది. తెలుగు రాని వాళ్లు సైతం సబ్ టైటిల్స్ లో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో నెట్ ప్లిక్స్ కు తెలుగు వాళ్లు చాలా మంది చందా దారులు అవుతున్నారు.మరో ప్రక్క ఇది యూఎస్ అభిమానులకు కూడా  గుడ్ న్యూస్ గా చెప్పాలి ..వాళ్లంతా నెట్ ఫ్లిక్స్ లో ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో ఈ సినిమా చూస్తూనే ఉన్నారు. ఇలా నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమా రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. సాధారణ రికార్డులని ఈ మీడియాలో కూడా దాటేస్తుంది అంటున్నారు ట్రేడ్ పండితులు.