యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది భీష్మ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. వెంకీ కుడుముల దర్శత్వంలో నితిన్, రష్మిక మందన జంటగా నటించిన భీష్మ మూవీ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం నితిన్ వెంకీ అట్లూరి దర్శత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్రంలో నితిన్ కి జోడిగా 'మహానటి' కీర్తి సురేష్ నటిస్తోంది. లాక్ డౌన్ తర్వాత ఈ చిత్ర షూటింగ్ మరింత జోరుగా ముందుకు సాగనుంది. తాజా సమాచారం మేరకు నితిన్, కీర్తి సురేష్ జోడి మరోసారి రిపీట్ కానున్నట్లు టాక్. 

రంగ్ దే చిత్రం తర్వాత నితిన్ అంధాదున్, చంద్రశేఖర్ యేలేటి దర్శత్వంలో చెక్ అనే మూవీలో నటించనున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తి కాగానే నితిన్ కృష్ణ చైతన్య దర్శత్వంలో పవర్ పేట అనే చిత్రంలో నటించాల్సి ఉంది. 

పవన్, త్రివిక్రమ్ 'జల్సా' వివాదం.. పూనమ్ కౌర్ ఎన్నాళ్లకు క్లారిటీ ఇచ్చింది..

యదార్థ సంఘటనల ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్ గా సాగే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా భారీ బడ్జెట్ లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ అని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.