యంగ్ హీరో నితిన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. 36 ఏళ్ల నితిన్ సింగిల్ లైఫ్ కు త్వరలో ఎండ్ కార్డు పడనుంది. ఇటీవల ప్రేమ జంట నితిన్, షాలినిల వివాహ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో నితిన్ సినీ అంభిమానులందరికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. 

సాధారణంగా సెలెబ్రిటీల ప్రేమ సంగతులు మీడియాలో లీక్ అయిపోతుంటాయి. కానీ నితిన్ ప్రేమ వ్యహారం గురించి ఒక్క వార్త కూడా రాలేదు. నితిన్ నటించిన భీష్మ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా నితిన్ తనప్రేమ సంగతులు వివరించాడు. 

సెలెబ్రిటీల ప్రేమ కథలు లీక్ అవుతుంటాయి.. మీ ప్రేమ సంగతి ఎందుకు లీక్ కాలేదు అని మీడియా నితిన్ ని ప్రశ్నించింది. దీనికి నితిన్ బదులిస్తూ.. మా ఇద్దరి ప్రేమ వ్యవహారం లీక్ కాకుండా చాలా ప్లాన్డ్ గా మ్యానేజ్ చేశాం. ముందుగా ఆ అమ్మాయిపై మీడియా అటెన్షన్ ఉండకూడదని భావించా. అందుకే తామిద్దరం ఏళ్ల తరబడి ప్రేమించుకుంటున్నా ఎలాంటి విషయాలు బయటకు రానివ్వలేదు అని నితిన్ తెలిపాడు. 

అఫీషియల్: ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ.. బిగ్ సర్ ప్రైజ్ అదిరింది!

నా పెళ్లి మూడేళ్ళ క్రితమే కావాల్సింది. కానీ నేను ఆ సమయంలో సిద్ధంగా లేను. ఇప్పుడు కుదిరింది అని నితిన్ చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 16న నితిన్ వివాహం దుబాయ్ లో జరగబోతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన భీష్మ చిత్రంలో నితిన్, రష్మిక జంటగా నటించారు. వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో భీష్మపై మంచి అంచనాలు ఉన్నాయి. 

4 అడవులు, 16 ఏనుగులు.. బాహుబలి చాలా ఈజీ.. రాజమౌళిపై రానా కామెంట్స్!