టాలీవుడ్ లో రానా దగ్గుబాటి విలక్షణ నటనకు మారుపేరుగా మారిపోయాడు. ఎలాంటి ఛాలెంజ్ అయినా స్వీకరిస్తూ.. విభిన్నమైన చిత్రాలతో రానా దూసుకుపోతున్నాడు. పాత్ర బలమైనది అయితే విలాన్ గా కూడా అద్భుతమైన నటనతో మెప్పిస్తానని రానా ఇదివరకే బాహుబలి చిత్రంతో రుజువు చేశాడు. ఘాజి, నేను రాజు నేనే మంత్రి ఇలా రానా ఎంచుకుంటున్న కథలన్నీ వైవిధ్యంగానే ఉంటున్నాయి. దీనితో ప్రస్తుతం రానాకు జాతీయ స్థాయిలో క్రేజ్ పెరుగుతోంది. 

ప్రస్తుతం రానా మరో భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రానా తాజాగా నటించిన చిత్రం అరణ్య. హిందీలో హాథీ మేరే సాథీ, తమిళంలో కాదన్ గా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఏప్రిల్ 2న రిలీజ్ చేయనున్నారు. కొన్ని రోజుల క్రితమే టీజర్ రిలీజ్ చేయాగా అద్భుతమైన స్పందన వచ్చింది. రానా ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి నటించాడు. 

పూర్తిగా అడవి మనిషిలా మారిపోయాడు. తాజాగా ఈ చిత్రం గురించి చిత్ర యూనిట్ మరిన్ని విశేషాలు తెలియజేసింది. ఈ చిత్రాన్ని రెండు దేశాల్లో షూట్ చేశారు. నాలుగు భయంకరమైన అడవులు తిరిగారు. కేరళ, మహాబలేశ్వర్, ముంబై, థాయ్ ల్యాండ్ అటవీ ప్రాంతాల్లో దాదాపు 250 రోజుల పాటు ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. 

ఈ చిత్రంలో రానా బందేవ్ అనే పాత్రలో నటిస్తున్నాడు. అడవిని, అడవి జంతువులని రక్షించే పాత్ర అది. రానాతో పాటు 16 ట్రైన్డ్, తెలివైన ఏనుగులు ఈ చిత్రంలో నటించాయి. రానా పిలిచినా, విజిల్ వేసినా పరిగెత్తుకుని వచ్చే ఉన్ని అనే ఏనుగు ఈ చిత్రంలో హైలైట్ కాబోతోంది. 

తమిళ నటుడు విష్ణు విశాల్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. కొన్ని రోజుల క్రితం రానా కూడా అరణ్య చిత్రాన్ని, బాహుబలిని పోల్చుతూ సరదా కామెంట్స్ చేశాడు. అంతా బాహుబలిలో నటించడం కష్టం అని అనుకుంటారు. కానీ అరణ్యలో నటించిన తర్వాత రాజమౌళి చాలా మంచి వ్యక్తి అని అనిపించారు. నా కోసం ఓ కోట కట్టి, అందులో నా విగ్రహం కూడా పెట్టారు. కానీ ఈ చిత్రంలో నన్ను తీసుకెళ్లి అడవుల్లో ఏనుగుల మధ్య పడేశారు అంటూ రానా ఫన్నీ కామెంట్స్ చేశారు. 

ప్రభు సోలమన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. 

మోసగాడిని కాదు.. ఆమె ఏడుపు వల్ల నేను బలి, బ్రేకప్ కు కారణం ఇదే!