సాధారణంగా హీరో, హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలను బయటకి చెప్పడానికి ఇష్టపడరు. ఇక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, గర్ల్ ఫ్రెండ్ ఉందని అసలే చెప్పరు. కానీ హీరోయిన్ నిక్కీ గల్రాని మాత్రం తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెబుతోంది. 

బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఈ కన్నడ బ్యూటీ ఆ తరువాత మోడలింగ్ రంగాల్లో రాణించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా మొదట మాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంది. ఆ తరువాత కన్నడ, తమిళ భాషల్లో హీరోయిన్ గా ఛాన్స్ లు దక్కించుకొని వరుస చిత్రాల్లో నటించింది.

షాక్: 'వినయ విధేయ రామ’ కొత్త రికార్డ్.. సూపర్ హిట్స్ కే ఆ సీన్ రాలేదు

ఒకానొక సమయంలో తమిళం వరుస హిట్లు అందుకుంది. అయితే ఆ తరువాత ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో మార్కెట్ లో ఆమె బాగా డౌన్ అయింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ అమ్మడుకి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎవరినైనా ప్రేమించారా..? అని నిక్కీని ప్రశ్నించగా.. వెంటనే అవును అంటూ బదులిచ్చింది.

తన లవర్ ని చెన్నైలో కలుసుకున్నట్లు చెప్పిన ఆమె ప్రస్తుతానికి అతడెవరనే విషయాన్ని బయటకి చెప్పనని తెలిపింది. తను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని.. దానికి ఇంకా సమయం ఉందని వెల్లడించింది. తను నటించాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయని.. మంచి పాత్రల్లో నటించాలని.. మరో మూడేళ్లలో పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

అయితే కొందరు మాత్రం మార్కెట్ లో ఆమె వాల్యూ తగ్గడంతో పెళ్లివైపు అడుగులు వేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం నిక్కీ తమిళంలో ఓ సినిమా అలానే మలయాళంలో రెండు సినిమాల్లో నటించింది. ఈమె నటించిన సినిమా డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. కానీ నేరుగా తెలుగు సినిమాలు చేయలేదు ఈ బ్యూటీ. టాలీవుడ్ లో 'బుజ్జిగాడు' సినిమాలో నటించిన సంజన సోదరే ఈ నిక్కీ గల్రాని.