డిఫరెంట్ చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్..  ఈ మధ్యకాలంలో బాగా వెనకబడ్డారు. ఆయన నటించిన అర్జున్ సురవరం చిత్రం క్రితం సంవత్సరం డిసెంబర్ 28 రిలీజ్ డేట్ ఇస్తే ఇప్పుడు ఈ నవంబర్ 29 కు థియోటర్ లో దిగుతోంది. ఈ సినిమా రిలీజ్ పెద్ద నిఖిల్ కు పెద్ద యజ్ఞమైపోయింది.  ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న నిఖిల్ రిలీజ్ లేటుతో నిరాశలో పడిపోయారు. అయితే అన్ని అడ్డంకులు దాటుకుని రిలీజ్ కు రావటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు.  ఈ నేపధ్యంలో రేపు(శుక్రవారం) విడుదల అవుతున్న ఈ సినిమా  గురించి ఫిల్మ్ నగర్ టాక్ ఎలా ఉందో చూద్దాం.

ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ల స్కామ్ నేపథ్యంలో తమిళంలో తెరకెక్కిన కనితన్ మూవీ అక్కడ బాగా హిట్ అయింది. ఇప్పుడిదే సినిమాని తెలుగులో అర్జున్ సురవంగా  రీమేక్ చేసారు.  ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ టీఎన్ సంతోష్ ఈ తెలుగు వెర్షన్ ని సైతం డైరక్ట్ చేసారు.

అది నకిలీ ఫోటో.. ఎందుకిలా చేస్తున్నారు.. చిన్మయి ఫైర్!

126 నిముషాలు మాత్రమే క్రిస్ప్ రన్ టైమ్   ఈ సినిమాకు పాజిటివ్ గా చెప్తున్నారు. అలాగే కేవలం లావణ్య, నిఖిల్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ తప్పించి... మిగతా పాటలు సైతం సిట్యువేషన్ గా సాగుతాయి.

అయితే సినిమా పూర్తై ఏడాది పైగా కావటంతో ఆ ఇంపాక్ట్ కనపడుతుందంటున్నారు.  స్క్రీన్ ప్లే కొంతవరకూ బాగానే ఎంగేజ్ చేస్తుందని, అయితే నిఖిల్ కెరీర్ లో సూపర్ హిట్స్ గా నిలిచిన స్వామి రారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా తరహా సినిమా స్దాయి మాత్రం కాదని, ఓ డీసెంట్ సినిమాగా నిలుస్తుందని చెప్తున్నారు. నిఖిల్ సైతం బాగా ఫెరఫార్మ్ చేసాడని వినికిడి.
 
ఈ సినిమాలో జర్నలిస్టుగా కనిపించనున్న నిఖిల్‌.. నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసే ఓ ముఠా గుట్టురట్టు చేస్తాడు. ఈ క్రమంలో అతడు ఎదుర్కొనే సమస్యలు, కోల్పోయే ప్రేమ, గౌరవం, ప్రత్యర్థులపై తీసుకునే రివేంజ్‌ ఇలా అన్ని కలగలిపి సినిమా సాగుతుంది.  

నిర్మాత ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్‌ ఎల్‌ ఎల్‌ పి పతాకంపై రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.   నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు న‌టిస్తున్నారు.