Asianet News TeluguAsianet News Telugu

నిఖిల్ కి కాబోయే భార్య.. బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, రేవతిల నిశ్చితార్ధం జరుగుతోంది. నిఖిల్ పెళ్లిని చాలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నానని అతడి తండ్రి కుమారస్వామి తెలిపారు. 

Nikhil Kumaraswamy to marry revathi
Author
Hyderabad, First Published Feb 10, 2020, 2:25 PM IST

ఈరోజు (ఫిబ్రవరి 10) బెంగుళూరులో తాజ్ వెస్టెండ్‌ హోటల్ లో జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, రేవతిల నిశ్చితార్ధం జరుగుతోంది. నిఖిల్ పెళ్లిని చాలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నానని అతడి తండ్రి కుమారస్వామి తెలిపారు.

రామనగర-చెన్నపట్టణ మధ్యలో వివాహం నిర్వహిస్తామని.. దీనికి తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇంతకీ నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్న రేవతి ఎవరో తెలుసా..? బెంగుళూరుకి చెందిన రేవతి మాజీ కాంగ్రెస్ లీడర్, మినిస్టర్ ఎం. కృష్ణప్పకి మనవరాలి వరస అవుతుంది.

నిఖిల్ గౌడ ఎంగేజ్మెంట్.. అమ్మాయిని చూశారా..?

ఇరు కుటుంబసభ్యులకు మధ్య సత్సంబంధాలు ఉండడంతో కృష్ణప్ప కుటుంబానికి చెందిన అమ్మాయిని తన ఇంటి కోడలిగా చేసుకుంటున్నారు కుమారస్వామి. రేవతి ఎంసిఏ చదువు పూర్తి చేసింది. రేవతి తల్లితండ్రులు మంజు, శ్రీదేవిలు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పేరు గాంచారు. ప్రస్తుతం ఈమె తన కుటుంబానికి చెందిన వ్యాపారాలు చూసుకుంటుంది.

తనకు కాబోయే భార్యని పరిచయం చేసిన నిఖిల్.. ఆమె తనకు బెస్ట్ పార్టనర్ అవుతుందని చెప్పారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేయొద్దని రిక్వెస్ట్ చేశాడు. ఆమె చాలా అమాయకురాలని.. ఆడవాళ్లు సున్నితంగా ఉంటారని.. విమర్శలు తీసుకోలేరని.. తనకు ట్రోలింగ్ అలవాటు అయిపోయిందని.. తనకు కాబోయే భార్యని మాత్రం ఇందులోకి లాగొద్దని చెప్పారు.

'జాగ్వార్' సినిమాతో హీరోగా పరిచయమైన నిఖిల్ ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకున్నారు. మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్‌ చేతితో పరాజయం పాలయ్యారు.  

Follow Us:
Download App:
  • android
  • ios