ఈరోజు (ఫిబ్రవరి 10) బెంగుళూరులో తాజ్ వెస్టెండ్‌ హోటల్ లో జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, రేవతిల నిశ్చితార్ధం జరగనుంది. ఆదివారం నాడు కుమారస్వామి బెంగుళూరులో తన నివాసంలో నిఖిల్ ఎంగేజ్మెంట్ గురించి మీడియాతో మాట్లాడారు.

వేడుకకి సంబంధించిన అన్ని ఏర్పాటు చేశామని అన్నారు. అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు ఇలా సుమారు నాలుగైదు వేల మంది ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. నిఖిల్ పెళ్లిని చాలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నానని.. కుమారస్వామి తెలిపారు.

ఆస్కార్ 2020: మరోసారి విన్నర్ గా నిలిచిన టాయ్ స్టోరీ(4)

ఈ పెళ్లిపై తను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని.. నటునిగా, రాజకీయనేతగా తన కుమారుడిని ఆశీర్వదించిన వారందరినీ ఈ పెళ్లికి ఆహ్వానిస్తానని.. రామనగర-చెన్నపట్టణ మధ్యలో వివాహం నిర్వహిస్తామని.. దీనికి తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.

'జాగ్వార్' సినిమాతో హీరోగా పరిచయమైన నిఖిల్ ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకున్నారు. మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్‌ చేతితో పరాజయం పాలయ్యారు.