Asianet News TeluguAsianet News Telugu

ఆస్కార్ 2020: మరోసారి విన్నర్ గా నిలిచిన టాయ్ స్టోరీ(4)

అత్యధిక ఆదరణ పొందిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజెల్స్ లో మొదలైంది. సోమవారం నాడు జరిగిన 92వ ఆస్కార్ సెలబ్రేషన్స్ లో ప్రముఖ నటులు, టెక్నీషియన్స్ పాల్గొన్నారు. అయితే వేడుకలో పిక్సార్ సంస్థ మరోసారి తన సత్తా చాటింది.

pixar wins another feature oscar with toy story 4
Author
Hyderabad, First Published Feb 10, 2020, 8:44 AM IST

ప్రపంచంలోకెల్లా అత్యధిక ఆదరణ పొందిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజెల్స్ లో మొదలైంది. సోమవారం నాడు జరిగిన 92వ ఆస్కార్ సెలబ్రేషన్స్ లో ప్రముఖ నటులు, టెక్నీషియన్స్ పాల్గొన్నారు. అయితే వేడుకలో పిక్సార్ సంస్థ మరోసారి తన సత్తా చాటింది. యానిమేటెడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ ఇప్పటివరకు 9 ఆస్కార్స్ ని (టాయ్ స్టోరీ 3) అందుకుంది.  ఇక ఇప్పుడు ఆ సంస్థ నుంచి  వచ్చిన టాయ్ స్టోరీ 4 కూడా ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ గా అవార్డును సొంతం చేసుకుంది.

చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలకు ప్రాణం ఉంటే వాటి హావభావాలు, భావోద్వేగాలు ఎలా ఉంటాయనేది ఆ సినిమాలో అసలు పాయింట్. గత ఏడాది విడుదలైన టాయ్ స్టోరీ 4 మరోసారి జనాలను ఆకట్టుకుంది. ప్రస్తుతం హాలీవుడ్ మీడియాలో ఈ సినిమాపై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.  గతంలో పిక్సార్ నుంచి వచ్చిన ఈ 9 చిత్రాలు అకాడమీ అవార్డ్స్ అందుకున్నాయి. "ది ఇన్క్రెడిబుల్స్" (2004), "రాటటౌల్లె" (2007), "వాల్-ఇ" (2008), "అప్" (2009), "టాయ్ స్టోరీ 3" (2010), "బ్రేవ్" (2012), "ఇన్సైడ్ అవుట్ "(2015), మరియు" కోకో "(2017).

బెస్ట్‌ యానిమేటేడ్‌ ఫీచర్‌: టాప్ స్టోరీ 4

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ : అమెరికన్ ఫ్యాక్టరీ

బెస్ట్‌ లైవ్‌ యాక్షన్ షార్ట్‌: ది నైబ‌ర్స్ విండో

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే : బాంగ్‌ జూన్‌ హో( పారాసైట్‌)

బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ : లెర్నింగ్ టూ స్కేట్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ ( ఇఫ్ యుఆర్ ఏ గ‌ర్ల్‌)

బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ : హెయిర్‌ లవ్‌

ఉత్తమ సహాయక నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)

ఉత్తమ డాక్యుమెంటర్‌ షార్ట్‌ ఫీచర్‌ : అమెరికర్‌ ఫ్యాక్టరీ

ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు: బ్రాడ్‌పిట్‌ ( వన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలీవుడ్‌) బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే : టైకా వైటిటి( జోగో ర్యాబిట్‌)

Follow Us:
Download App:
  • android
  • ios