ఈ రెండు రోజులు కూడా సోషల్ మీడియాలో మోదీ, ట్రంప్ లే హాట్ టాపిక్. ఈ పర్యటనపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు, వార్తలు షేర్ అవుతున్నాయి. 

భారత పర్యటనకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి మోదీ సర్కార్ అపూర్వ స్వాగత సత్కారాలు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్ లో విందు తరువాత ఘనంగా ట్రంప్ కి వీడ్కోలు పలికారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ రెండు రోజులు కూడా సోషల్ మీడియాలో మోదీ, ట్రంప్ లే హాట్ టాపిక్. ఈ పర్యటనపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు, వార్తలు షేర్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా.. హీరోయిన్ నికిషా పటేల్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

అఫీషియల్ : 'మహానటి' డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా!

నికిషా తన ట్వీట్ లో.. జాతీయ మీడియాలో మాట్లాడిన ఓ నటి.. డొనాల్డ్ ట్రంప్‌ను డొనాల్డ్ డంప్ అనడం తాను విన్నానని.. అనుకోకుండా జరిగిపోయిందని చెబుతున్నా.. కావాలనే చేసినట్లుగా ఉందని నవ్వుతూ పోస్ట్ పెట్టింది.

ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు డొనాల్డ్ ట్రంప్ పై అంత సాహసం చేసిందెవరా అని ఆలోచనలో పడ్డారు. కొంతమంది ట్రంప్.. సచిన్ ని సుచిన్ అని పలికారు కదా అందుకే ఆయన్ని డంప్ అని ఉండొచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

Scroll to load tweet…