బాలీవుడ్ ప్రముఖ నటుడు హిమాన్షు కోహ్లీ, సింగర్ నేహా కక్కర్ గత ఏడాది విడిపోయిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా రిలేషన్ షిప్ ఉన్న వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. వీరిద్దరి బ్రేకప్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక నేహా కక్కర్ సోషల్ మీడియాలో కన్నీరు పెట్టుకుంటూ తన హృదయం బద్దలైందని కామెంట్స్ చేసింది. 

దీనిపై హిమాన్షు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. మేమిద్దరం విడిపోయాక నేహా సోషల్ మీడియాలో చాలా ఎమోషనల్ అయింది.. ఇక మా మధ్య ఎలాంటి రిలేషన్ ఉండదని కన్నీరు పెట్టుకుంటూ ప్రకటించింది. అది చూసి నేను షాక్ అయ్యా. మా బ్రేకప్ తర్వాత ప్రతి ఒక్కరూ నన్నో మోసగాడిలా చూడడం ప్రారంభించారు. 

పబ్లిసిటీ కోసమే నేహాని ప్రేమించానని.. బాలీవుడ్ లో అవకాశాలు పెరిగాక ఆమెని వదిలేశాను అంటూ చాలా కామెంట్స్ వినిపించాయి. నాకు చాలా బాధగా అనిపించింది. నా జీవితంలో అవే చాలా క్లిష్టమైన రోజులు. బ్రేకప్ కు తాను కారణం కాదని, జరిగిన సంగతిని బయటపెడతామని సోషల్ మీడియాలో టైప్ చేసి కూడా చాలా సార్లు ఆగిపోయి. నేహాని దోషిగా చూపించడం నాకు ఇష్టం లేదు. అందుకే భరించా అని హిమాన్షు తెలిపాడు. 

దిల్ రాజుకు బిగ్ షాక్.. 'ఎస్వీసి' నుంచి అతడు అవుట్!

నేహాని నేను కెరీర్ కోసం ప్రేమించలేదు. నిజాయతీగానే ప్రేమించా. విడిపోవాలన్న నిర్ణయం నాది కాదు.. తనదే. నేహాతో పరిచయానికి ముందే నేను నాలుగు చిత్రాల్లో నటించా. ఆమెతో ప్రేమలో పడ్డాక ఎక్కువ చిత్రాల్లో నటించలేదు అని హిమాన్షు తెలిపాడు. ప్రజలకు వాస్తవాలు తెలియవు. కళ్ళకు ఏది కనిపిస్తే అది నిజం అని నమ్మేస్తారు. నేహా ఎమోషనల్ కావడం వల్ల అంతా నన్ను దోషిలా చూశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని హిమాన్షు వివరణ ఇచ్చాడు.