చిత్ర పరిశ్రమలో ఎక్కువగా నటీనటులకే ఎక్కువ గుర్తింపు ఉంటుంది. నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులకు ఆ స్థాయిలో గుర్తింపు ఉండదు. కానీ దిల్ రాజు అందుకు అతీతం. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్. దిల్ రాజు కన్నా సీనియర్ ప్రొడ్యూసర్స్ చాలా ఉన్నారు. కానీ దిల్ రాజు తన ప్రమోషన్ టెక్నిక్స్ తో సెలెబ్రిటీ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. 

టాలీవుడ్ లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న నిర్మాణ సంస్థల్లో 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్ ఒకటి. ఈ సంస్థలో దిల్ రాజు, లక్ష్మణ్ లు భాగస్వాములుగా ఉన్నారు. కథల ఎంపికలో వీరిద్దరి జడ్జిమెంట్ కు తిరుగులేదని ఇండస్ట్రీలో అంతా ప్రశంసిస్తుంటారు. 

ప్రస్తుతం వీరిమధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. విభేదాలు తలెత్తడమే కాదు.. లక్ష్మణ్ ఎస్విసి బ్యానర్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇన్నేళ్ళుగా విజయవంతంగా సాగిన వీరి ప్రయాణానికి బ్రేక్ పండింది. ఇది దిల్ రాజుకు బిగ్ షాక్ అని అంటున్నారు. ఇటీవల ఎస్వీసి సంస్థ తెలుగు రాష్ట్రాల్లో అనేక థియేటర్స్ ని లీజుకు తీసుకుంది. ఈ వ్యవహారంలో కూడా లక్ష్మణ్ సైలెంట్ గా ఉన్నట్లు టాక్. 

ఇదిలా ఉండగా లక్ష్మణ్ త్వరలో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో పలువురు ప్రముఖుల మద్దతు కూడా లక్ష్మణ్ కు ఉందట. ఇప్పటికే లక్ష్మణ్ సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. క్రిష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రియాడికల్ మూవీ నైజాం హక్కులని శిరీష్ సొంతం చేసుకున్నారట. 

పడవ సెట్, పాటతో కనికట్టు: పవన్, క్రిష్ లేటెస్ట్ అప్ డేట్!

లక్ష్మణ్ తన కొడుకుని పెట్టి త్వరలో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం లక్ష్మణ్ తనయుడు.. చిరంజీవి, కొరటాల చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. లక్ష్మణ్ తప్పుకోవడం దిల్ రాజుకు పెద్ద షాకే. కానీ ఎస్వీసి సంస్థకు ఇప్పట్లో వచ్చిన ప్రమాదమేమీ లేదని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ సంస్థలో అనేక విజయవంతమైన చిత్రాలు తెరకెక్కుతున్నాయి. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు.