ఇండియన్ ఐడల్ సీజన్ 11 హోస్ట్ ఆదిత్య నారాయణ్, జడ్జి నేహా కక్కర్ లు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్ లో ఈ షో మొదలైనప్పటి నుండి ఆదిత్య, నేహాల మధ్య కెమిస్ట్రీ నడుస్తోంది.

దీనికి ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యారు. ఇటీవల ఆదిత్య.. నేహాకి ప్రపోజ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. వృత్తి రీత్యా ఇద్దరు సింగర్లు కావడం విశేషం. ఇటీవల ఆదిత్య, నేహా తల్లితండ్రులు ఇండియన్ ఐడల్ షోకి హాజరయ్యారు. ఆ సమయంలో ఆదిత్య తండ్రి ఉదిత్ నారాయణ్.. నేహాని ఆటపట్టించాడు.

హరీష్, పవన్ చిత్రం: డైలాగుల్లో అంతర్లీనంగా ఆ కంటెంట్!

నేహాని తన కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆదిత్య తల్లి కూడా అదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మరోపక్క ఈ షోని ప్రసారం చేస్తోన్న ఛానల్ కూడా నేహా, ఆదిత్యలు ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోనున్నట్లు ఓ ప్రోమోలో తెలిపింది.

అయితే ఇది షో ప్రమోషన్ కోసం చేశారా..? లేక నిజంగానే ఫిబ్రవరి 14న ఈ జంట పెళ్లి చేసుకోనున్నారా అనేది తెలియాల్సివుంది. అయితే చాలా మంది మాత్రం నేహా, ఆదిత్యలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరూ కూడా సోషల్ మీడియా వేదికగా తాము పెళ్లి చేసుకోనున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.