డైరక్టర్ హరీష్ శంకర్ అనగానే అతని ఖాతాలో ఎన్ని హిట్స్ ఉన్నా....వెంటనే గుర్తు వచ్చేది మాత్రం గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ తో మాస్ హీరోయిజం ఎలివేట్ చేస్తూ క్లాస్ గా తీసిన ఆ మూవి క్రియేట్ చేసిన రికార్డ్ లు అన్నీ ఇన్నీ కావు. అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ మళ్లీ సినిమా మొదలవుతోందంటే ఇంక రచ్చ చెప్పేదేముంది. అయితే హరీష్ శంకర్ పై కేవలం కమర్షియల్ హిట్ కొట్టడమే కాకుండా మరో భాధ్యత కూడా భుజాన వేసుకున్నారట. అప్పట్లో దాసరి..బొబ్బలి పులి చిత్రంతో ఎన్టీఆర్ ..రాజకీయ జీవితానికి కిక్ ఇచ్చినట్లు..ఇప్పుడు కూడా ఈ సినిమాలో హరీష్ ద్వారా ఆ పనిని పవన్ చేయాలని భావిస్తున్నారట.

అందుతున్న సమాచారం మేరకు జనసేన పార్టీ సిద్దాంతాలను కూడా ఈ సినిమాలో అంతర్లీనంగా డైలాగులు రూపంలో పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు పవన్ సూచన చేసారని, ఆ మేరకు డైలాగులు మారుస్తున్నారని ఇండస్ట్రిలో చెప్పుకుంటున్నారు. హరీష్ శంకర్ డైలాగులు రాయటంలో దిట్ట. దాంతో పవన్ తో ఏ తరహా డైలాగులు చెప్పి థియోటర్లు దద్దరిల్లేలా చేస్తారా అని ఫ్యాన్స్ మంచి ఎక్సపెక్టేషన్స్లో ఉన్నారనేది నిజం.

పవన్, రామ్ చరణ్ లకు వల వేస్తోన్న కుర్ర డైరెక్టర్!

అదీ పార్టీకు కూడా ఉపయోగపడే డైలాగులు అయితే ఇంక చెప్పేదేముంది. ఒకప్పుడు రజనీ సినిమాల్లో అలాంటి అండర్ కరెంట్ పొలిటికల్ డైలాగులు ఉండేవి. ఇప్పుడు అదే పద్దతిని పవన్ కు ఫాలో కానున్నట్లు వార్త.  అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

మరో ప్రక్క ఈ కాంబోకి ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు. అయితే అదే సమయంలో ప్యాన్స్ నుంచి వరస అభినందనలతో పాటు రిక్వెస్ట్ లు వస్తున్నాయట. తమ అభిమాన హీరోని ఎలా చూపిస్తే బాగుంటుందో వాళ్ళు భావిస్తున్నారో  సూచనలిస్తున్నారట. దాంతో ఇది ఓ విధంగా ఇబ్బందికరమైనదే అయినా, అంతమంది అభిమానులు మీ సినిమా కోసం ఎదురుచూస్తున్నాం అంటూ సూచనలు ఇవ్వటం మాత్రం ఆనందకరమైన విషయమే.

దాంతో ఇప్పుడు హరీష్ మరింతగా స్క్రిప్టు పై దృష్టి పెడుతూ..గబ్బర్ సింగ్ ని మించే బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడట. ఒకటికి నాలుగు సార్లు తను రాసుకున్న స్క్రిప్టుని రీరైట్ చేస్తున్నాడట. పవన్ ..పూర్తి స్క్రిప్టు విని ఒక్క కరెక్షన్ కూడా చెప్పకూడదనే అనే స్దాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట.