దక్షిణాదిలో నటించిన కొందరు బాలీవుడ్ భామలు ఇక్కడి హీరోలపై, దర్శకులపై ఘాటు వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. రాధికా ఆప్తే, ఇలియానాతో సహా పలువురు నటీమణులు ఈ లిస్ట్ లో ఉన్నారు. సౌత్ లో హీరోయిన్లకు వేధింపులు ఎక్కువన్నట్లుగా వారు మాట్లాడారు.

తాము సౌత్ లో పలు రకాల వేధింపులను ఎదుర్కొన్నట్లుగా వారు వ్యాఖ్యానించారు. ఇక ఈ లిస్ట్ లో తాజాగా నేహా ధూపియా చేరింది. బాలీవుడ్ లో 'జూలీ' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నేహా ఆ తరువాత సౌత్ లో పలు సినిమాలు చేసింది. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయింది.

పవన్ కళ్యాణ్ పాటకు జూ.ఎన్టీఆర్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో!

ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ సౌత్ లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి వివరించింది. ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు హీరో కంటే ముందుగా కనీసం భోజనం చేయడానికి వీల్లేదని షూటింగ్ స్పాట్ లో కండీషన్ పెట్టారని తెలిపింది.

తనకు ఆకలిగా ఉందని చెప్పినా.. ఎవరు వినలేదని.. హీరోకి ఇంకా షూటింగ్ కొనసాగుతూ ఉందని, అది పూర్తయిన తరువాత.. ఆయన భోజనం చేశాకే ఎవరైనా భోజనం చేయాలంటూ అడ్డుకున్నారని నేహా చెప్పుకొచ్చింది.

హీరో వచ్చి భోజనం చేసే వరకు తనకు కూడా భోజనం పెట్టలేదని తన అనుభవాన్ని వివరించింది. నేహా ధూపియా తెలుగులో తరుణ్ తో 'నిన్నే ఇష్టపడ్డాను', రాజశేఖర్ తో 'విలన్', బాలకృష్ణతో 'పరమవీరచక్ర' వంటి చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాల్లో ఏ సినిమాలో నటిస్తున్న సమయంలో నేహాకి ఇలాంటి ఇబ్బంది ఎదురైందో అంచనా వేయొచ్చు!