టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ సమయంలో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. అతడికి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. అంతే మంది వ్యతిరేకులు కూడా ఉన్నారు.

ఈ మధ్యకాలంలో విజయ్ నటిస్తోన్న సినిమాలపై నెగెటివ్ ప్రచారం ఓ రేంజ్ లో జరుగుతోంది. అతడిపై వచ్చే ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. 'డియర్ కామ్రేడ్' సినిమా ఏవరేజ్ గా ఉన్నప్పటికీ.. దాని గురించి నెగెటివ్ ప్రచారం చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. విజయ్ కొత్త సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' ఆ సినిమా కంటే బెటర్ గానే ఉంది.

''మహేష్ తో పెళ్లికి నో చెప్పారు.. నాలుగేళ్లు దూరంగా ఉన్నా..''

అయినప్పటికీ  యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. సినిమాపై నెగెటివ్ ప్రచారం ఓ రేంజ్ లో సాగుతోంది. ఇదొక చెత్త సినిమా అని కామెంట్స్ చేస్తున్నారు. నెగెటివ్ టాక్ చాలా వేగంగా స్ప్రెడ్ కావడంతో ఆ ఎఫెక్ట్ తొలిరోజు సినిమా కలెక్షన్స్ పై పడింది. మార్నింగ్ షో, మ్యాట్నీలకు ఫుల్స్ పడితే.. సాయంత్రం షోల నుండి ఆక్యుపెన్సీ బాగా తగ్గిపోయింది. 


సినిమా ఎలా ఉన్నప్పటికీ విజయ్ కి ఉన్న క్రేజ్ తో తొలిరోజు హౌస్ ఫుల్స్ పడుతుంటాయి. కానీ ఈ సినిమా అలా జరగలేదు. దీని బట్టి నెగెటివ్ టాక్ ఎలా స్ప్రెడ్ అయిందో అర్ధమవుతోంది. తొలిరోజే సినిమా పరిస్థితి ఇలా ఉందంటే తరువాత ఎలా ఉంటుందో.. కనీసం వీకెండ్ లోనైనా సినిమా పుంజుకుంటుందేమో చూడాలి!