టాలీవుడ్ కి చెందిన సెలబ్రిటీ జంటల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా కాస్త స్పెషల్ అనే చెప్పాలి. 2000లో వచ్చిన 'వంశీ' సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ అటు మహేష్ ఫ్యామిలీ.. ఇటు నమ్రత ఫ్యామిలీ వీరి పెళ్లికి ఒప్పుకోలేదట.

ఈ విషయాన్ని నమ్రత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'వంశీ' సినిమా షూటింగ్ లో ప్రేమించుకున్నామని.. ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు చెప్పారు. కానీ మొదట్లో రెండు ఫ్యామిలీలు ఒప్పుకోకపోవడంతో.. నాలుగేళ్ల పాటు వాళ్లని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించామని చెప్పారు.

ఆ నాలుగేళ్లు తను, మహేష్ కలుసుకోలేదని.. అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లమని.. మొత్తానికి పెద్దవారు దిగొచ్చి తమ పెళ్లికి ఒప్పుకున్నారని.. అలా తనకు మహేష్ తో 2005లో పెళ్లి జరిగిందని చెప్పారు. మహేష్ కి చాలా సిగ్గని.. హీరోయిన్స్ తో సరిగ్గా మాట్లాడరని చెప్పుకొచ్చింది.

మహేష్, నమ్రత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవలే ఈ జంట తమ 15వ పెళ్లిరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం నమ్రత.. మహేష్ కి సంబంధించిన సినిమా వ్యవహారాలను దగ్గరుండి చూసుకోవడంతో పాటు తమ సొంత బ్యానర్ జిఎంబి ఎంటర్టైన్మెంట్ నిర్మాణ బాధత్యలు కూడా చూసుకుంటోంది.