అప్పట్లో అంటే ఓ పదేళ్ల క్రితం దాకా నాగరాణి, నాగమ్మ, నాగ దేవత, అమ్మా నాగమ్మా,దేవి ఇలా వరస సినిమాలు పాములను దేవతలగా చూపెడుతూ సినిమాలు వచ్చేవి. అయితే ఈ మధ్యకాలంలో ఎవరూ అలాంటి సినిమాలు చేసే ధైర్యం చేయటం లేదు. ఇంకా ఈ రోజుల్లో నాగదేవత ఏమటి అంటారని భయమో, లేక జనాల్లో భక్తి తగ్గిందనో అలాంటి సినిమాలు తగ్గించుకున్నారు నిర్మాతలు. అయితే తాజాగా నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో ఓ సినిమా ప్రారంభమైంది.  ‘మూకుత్తి అమ్మన్‌’  టైటిల్ తో రూపొందే ఈ చిత్రంలో నయనతార నాగ దేవత గా కనిపించనుంది. ‘మూకుత్తి అమ్మన్‌’. తెలుగులో ‘ముక్కుపుడక ఉండే అమ్మవారు’ అని అర్థం.

టెర్రరిస్ట్ గా మారిన సమంత..!

అయితే ఈ సినిమా భక్తిరస ప్రాధాన మైనది కాదట..పూర్తి వ్యంగ్యంతో కూడిన సెటైర్ అని తెలుస్తోంది. రేడియో జాకీ నుంచి హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆర్‌జే బాలాజీ ఈ సినిమా కు కథ,మాటలు, దర్శకత్వం అందిస్తున్నారు.   'ఎల్‌కేజీ 'చిత్రంతో హీరోగా అడుగుపెట్టి పెద్ద హిట్ ని సొంతం చేసుకున్నారు. తనదైన స్టైల్ లో వేసిన పంచ్‌ డైలాగులు ఈ పొలిటికల్‌ సెటైర్‌ చిత్రానికి కలిసిరావడంతో హిట్‌టాక్‌ అందుకుంది. దాంతో నయనతారను ఒప్పించి..ఇప్పుడీ చిత్రం మొదలెట్టారు.

ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు... ఎన్‌జె శరవణన్‌, ఆర్‌జే బాలాజీ. నటుడు ఆర్‌జే బాలాజీకి దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. ఆదివారం సినిమా టైటిల్‌ లోగో విడుదల చేశారు. త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది వేసవికి సినిమా విడుదల చేయాలనుకుంటున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ వేల్స్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ తెలిపింది.
 
ఇక నయనతార.. తమిళ్‌లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం నయనతార  తన లవర్ విఘ్నేశ్‌ శివన్‌ నిర్మాణంలో ‘నెట్రికన్’ అనే తమిళచిత్రంలో నటిస్తోంది. నయన్ ఈ సినిమాలో  కంటిచూపు సమస్య ఉన్న యువతి పాత్రలో నటిస్తోంది.