తెలుగువారికి సంక్రాంతి బిగ్ ఫెస్టివల్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి జరిగినట్లు సంబరాలు మరే పండుగకు జరగవు. తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా సంక్రాంతే కలసి వచ్చే పండుగ. టాలీవుడ్ అత్యధిక బిజినెస్ ఈ పండక్కే జరుగుతుంది. బడా హీరోల చిత్రాలు కనీసం నాలుగైనా సంక్రాంతికి విడుదలై వందల కోట్ల వసూళ్లు రాబడుతుంటాయి. 

సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలైనా సరే కంటే ఉంటే ప్రతి ఒక్క చిత్రానికి ఆదరణ ఉంటుంది. కానీ హీరోల మధ్య ఇగోలు, అభిమానుల మధ్య గొడవలు ఎప్పుడూ ఉండేవి. ఈ సారి సంక్రాంతికి ఆ వివాదాలు కాస్త శృతి మించినట్లు కనిపించాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రాల విడుదల తేదీలు ప్రకటించినప్పటి నుంచి రచ్చ షురూ అయింది. 

హీరోల మధ్య ఇగో వల్లో.. నిర్మాతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లో విడుదల తేదీల విషయంలో గొడవ జరిగింది. ఆ తర్వాత చర్చించుకుని 11, 12 తేదీల్లో రెండు చిత్రాలని రిలీజ్ చేసుకున్నారు. ఇక విడుదలయ్యాక కలెక్షన్ల విషయంలో కూడా పోటీనే. మా సినిమాకే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని పోటాపోటీగా పోస్టర్స్ విడుదలయ్యాయి. సోషల్ మీడియాలో అభిమానులు గొడవ పడ్డారు. ఈ మొత్తం తతంగం జరిగింది బన్నీ, మహేష్ చిత్రాల మధ్యే. 

ఇద్దరు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో నిలిస్తేనే ఇంత జరిగితే.. అదే ముగ్గురు బడా హీరోలు పోటీ పడితే.. ఆ విధ్వంసం ఊహించుకోవడమే కష్టం. వచ్చే ఏడాది సంక్రాంతికి అప్పుడే ప్రణాళికలు మొదలైపోయాయి అంటూ టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. 

షర్ట్ బటన్ తీసేసి సెక్సీ ఫోజులు.. రెచ్చిపోయిన హాట్ బ్యూటీ!

మహేష్ బాబు తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఉండబోతోంది. ఈ చిత్రాన్ని మేలో ప్రారంభించి 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇక త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్ర విడుదల కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే అని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీకి 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. 

నితిన్ తర్వాత మరో హీరో.. మలయాళీ పిల్ల మాయలో టాలీవుడ్ హీరోలు!

పింక్ రీమేక్ తో రీఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సంక్రాంతి బరిలో నిలుస్తునట్లు సమాచారం. పింక్ రీమేక్ చిత్రం సమ్మర్ లో విడుదల కానుంది. ఇక క్రిష్ దర్శత్వంలో భారీ బడ్జెట్ లో తెరకెక్కే పీరియాడిక్ చిత్రానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రం కూడా సంక్రాంతికే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి..