సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంటుందని దానికి కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని కొందరు నటీమణులు మీడియా ముందుకొచ్చి చెప్పారు. మరికొందరు తాము ఎదుర్కొన్న ఇబ్బందులు చెప్పడానికి సోషల్ మీడియాని వేదిక చేసుకున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి బెటర్ అని అంటోంది హాలీవుడ్ నటి నోమీ హారిస్. తన  కెరీర్  ఆరంభంలో ఓ సినిమా ఆడిషన్ కోసం వెళ్లినప్పుడు తాను ఎదుర్కొన్న భయంకరమైన పరిస్థితి గురించి నోమీ హారిస్ ఇప్పుడు బయట పెట్టింది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన ఇరవై ఏళ్ల వయసులో ఎదుకొన్న సంఘటన గురించి చెప్పుకొచ్చింది. సినీ నటిగా కెరీర్ మొదలుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తోన్న సమయంలో పలు చోట ఆడిషన్స్ కి వెళ్లిందట నోమీ. ఒకానొక సమయంలో ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిన స్టార్ హీరో సినిమా కోసం కూడా ఆడిషన్స్ కి వెళ్లిందట.

అక్కడ కాస్టింగ్ డైరెక్టర్, డైరెక్టర్, ఆ స్టార్ హీరో ఉన్నారట. ఆడిషన్స్ కోసం పిలిచిన తనతో ఆ  స్టార్ హీరో అసభ్యంగా ప్రవర్తించాడట. తన స్కర్ట్ లోకి చేయి పెట్టి అసభ్యంగా టచ్ చేయడంతో నోమీ భయంతో వణికిపోయిందట. ఆ హీరో అలా చేస్తుంటే అక్కడే ఉన్న డైరెక్టర్, ప్రొడక్షన్ వాళ్లు చూస్తూ ఉన్నారే తప్ప రియాక్ట్ అవ్వలేదని చెప్పుకొచ్చింది. ఆ సంఘటనను జీవితంలో మర్చిపోలేనని చెప్పుకొచ్చింది.

కెరీర్ ప్రారంభ దశ కావడంతో ఆ విషయాన్ని ఎవరికీ చెప్పెలేదని తెలిపింది. అయితే ఇప్పుడు ఆ స్టార్ హీరో పేరు బయటపెట్టాలని అనుకోవడం లేదని.. ఈ విషయాన్ని మరింత పెద్ద వివాదంగా మార్చే ఉద్దేశం లేదని చెప్పింది. ఆ సంఘటనతో నటన మీద ఆసక్తి పోయిందని.. కానీ మళ్లీ ప్రయత్నాలు చేసి అవకాశాలు  దక్కించుకున్నానని చెప్పుకొచ్చింది. 

గేస్, లెస్బియన్స్, ట్రాన్స్ జెండర్స్.. పాత్రల్లోనూ తాట తీసిన తారలు!