నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వి’.  ఈ సినిమా ప్రారంభమన నాటి నుంచి చిత్రంపై భారీ అంచనాలున్నాయి. వి చిత్రంలో నాని నెగెటివ్ షేడ్స్ ఉండే కిల్లర్ రోల్ చేస్తున్నాడని తెలియడంతో మరింత ఆసక్తి రేగింది. ఇక ఇప్పటికే విడుదలైన వి మూవీ టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.

యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగడంతో పాటు, 5 మిలియన్ వ్యూస్ వైపు దూసుకుపోతుంది. టీజర్ లో నాని లుక్ మరియు డైలాగ్ డెలివరీ, ఆట్టిట్యూడ్ డిఫరెంట్ గా ఆసక్తిరేపుతున్నాయి. దాంతో ఈ చిత్రం కథ ఏమై ఉంటుంది,ఈ సినిమా టైటిల్ వికు, క‌థ‌కు లింకేంటి అన్న‌ది అంతటా హాట్ టాపిక్ గా మారింది.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్ర‌కారం మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి ఈ సినిమా క‌థ ఆద్యంత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆక‌ట్టుకుంటుంద‌ట‌. అలాగే సినిమా కథ, కథనం అంతా ‘వి’ అనే అక్షరం చుట్టే తిరుగుతుందని అంటున్నారు. తాను క్రైమ్ చేసిన ప్రతిచోట ‘వి’ అనే అక్షరాన్ని క్లూ గా వదిలి వెళ్తుంటాడట కిల్లర్.

ఆ క్లూలతో ఈ క్రైంను క‌నిపెట్టేందుకు ఎంతో మంది  పోలీస్ అధికారులు వ‌చ్చినా వాళ్లంద‌రూ చేతులు ఎత్తేస్తుంటార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఈ వి అనే క్లూ తో ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సుధీర్ బాబు ఇన్వెస్టిగేషన్ సాగిస్తుంటాడట. అయితే అసలు కిల్లర్ ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడు ? ఆ కిల్ల‌ర్‌కు వి అనే అక్ష‌రానికి ఉన్న లింక్ ఏంట‌న్న‌దే ఈ సినిమా క‌థ అని టాక్‌.

ప్రభాస్ లాగా మారిపోయిన డోనాల్డ్ ట్రంప్.. బాహుబలి టీం రెస్పాన్స్!

వి మూవీలో మరో హీరో సుధీర్ కిల్లర్ నానిని వెంటాడే పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. వి మూవీ ఉగాది కానుకగా వచ్చే నెల 25న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది అందిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.