దర్శకుడు పరశురాం 'గీత గోవిందం' లాంటి హిట్టు సినిమా తీసి వంద కోట్ల దర్శకుల క్లబ్ లోకి చేరాడు. ఇలాంటి హిట్ సినిమా తీసినప్పటికీ ఆయనఫేట్ మాత్రం మారలేదనే చెప్పాలి. ఈ సినిమా విడుదలై సంవత్సరం గడుస్తోంది కానీ ఇప్పటివరకు పరశురాం కొత్త సినిమా ఏదీ సెట్స్ పైకి వెళ్లలేదు.

కనీసం ఆయనతో సినిమా చేసే హీరోలు కూడా దొరకడం లేదు. పరశురాం ఓ కథ సిద్ధం చేసుకొని మహేష్ బాబు దగ్గరకి వెళ్లాడు. కొన్ని రోజుల పాటు పరశురాం కథతో చర్చలు జరిపిన మహేష్ ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చేశారు. దీంతో ఆ కథ పట్టుకొని అఖిల్ దగ్గరకి వెళ్లారు. అక్కడ కూడా ప్రాజెక్ట్ సెట్ కాలేదు.

అల్లు అర్జున్ కి చుక్కలే.. తన రోల్ రివీల్ చేసిన పూజా హెగ్డే!

దీంతో కథను పక్కన పెట్టేసి ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ లైన్ రాసుకొని నాని చెప్పాడు. మొదట సినిమా చేద్దామని చెప్పిన నాని.. మెల్లగా సైడైపోయాడట. దీంతో ఆ కథను విజయ్ దేవరకొండకి వినిపిస్తే.. 'ఈ కథ కాస్త గీత గోవిందం'లానే ఉంది కదా' అని విజయ్ రిజెక్ట్ చేశాడట. వంద కోట్ల దర్శకుడు సైతం హీరోలు దొరక్క ఇబ్బందిపడుతున్నాడు. 

పరశురాం టార్గెట్ పెద్ద హీరోలతో సినిమా. విజయ్ దేవరకొండ, అంతకంటేఎక్కువ రేంజ్ హీరోలతో సినిమా చేయాలని భావిస్తున్నాడు. కానీ ప్రస్తుతం స్టార్ హీరోలంతా బిజీగా ఉన్నారు. నాని, శర్వానంద్ లాంటి మీడియం రేంజ్ హీరోలు కూడా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

పరశురాం కాస్త తగ్గి ఓ మెట్టు దిగితే మాత్రం సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలు సిద్ధంగా ఉన్నారు. కానీ పరశురాం దానికి అంగీకరించపోవడం కారణంగానే గ్యాప్ అనేది పెరుగుతూ వస్తోంది.