అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు విజయం సాధించాయి. దీనితో అల వైకుంఠపురములో చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. నా పేరు సూర్య చిత్రం నిరాశపరచడంతో ఈసారి తన అభిమానులకు మంచి హిట్ ఇవ్వాలనే పట్టుదలతో బన్నీ ఉన్నాడు. 

అందుకే నా పేరు సూర్య చిత్రం తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ కి ఓకే చెప్పాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. తాజాగా పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో అల వైకుంఠపురములో మూవీలో తన పాత్రని రివీల్ చేసింది. 

ఈ చిత్రంలో తాను అల్లు అర్జున్ కి బాస్ గా కనిపిస్తానని తెలిపింది. నేను చాలా కఠినంగా ఉంటా. నేను బన్నీని ఏడిపించే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి. అలాగే నా కొన్ని సందర్భాల్లో సాఫ్ట్ గా కూడానా ఉంటా. నా పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయని పూజా హెగ్డే తెలిపింది. 

ఈ చిత్రం త్రివిక్రమ్ మార్క్ లోనే ఉంటూ రొమాన్స్, డ్రామా, ఎమోషన్ ఇలా అన్ని అంశాల్లో మెప్పించే విధంగా ఉంటుందని పూజా హెగ్డే తెలిపింది. డీజే చిత్రంలో బన్నీతో పూజా హెగ్డే రొమాన్స్ చేసింది. వీరిద్దరూ కలసి నటిస్తున్న రెండవ చిత్రం ఇది. 

హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి అల వైకుంఠపురములో చిత్రం రిలీజ్ కానుంది. ఇప్పటికే తమన్ అందించిన రెండు పాటలు యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి.