సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలకు వేధింపులు బాగా పెరిగిపోయాయి. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా మరో నటి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. నటి నందితా శ్వేతాని ఓ వ్యక్తి అసభ్యకర మెసేజ్ లతో ఇబ్బంది పెడుతున్నాడట.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈమె అందరిలానే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా అకౌంట్స్ ని వినియోగిస్తుంది. తనకు సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.

‘అల.. వైకుంఠపురములో’ పోస్టర్ పై మండిపడుతున్న మహేష్..?

అలా నందితాశ్వేతని ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఫాలో అవుతున్నారు. అలా ఫాలో అయిన వారిలో వాంజి సెలియన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ యువకుడు అసభ్య మెసేజ్ లతో వేధింపులకు గురి చేస్తున్నాడట. దీని గురించి నందితాశ్వేతా స్పందిస్తూ.. ఆ వ్యక్తి అసభ్య మెసేజ్ లతో వేధింపులకు గురి చేస్తున్నాడని.. ఇలాంటి వారికి కుటుంబం అనేది ఉండదా..? అని ప్రశ్నించింది.

ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంలో పోలీసులకు కంప్లైంట్ చేసే ఆలోచన తనకు లేదని చెప్పింది. పోలీసుల వరకు విషయం తీసుకెళ్లి మరింత రచ్చ చేయడం ఈమె ఇష్టం లేనట్లుంది.

ఇక్కడితే ఆ యువకుడు నందితని ఇబ్బంది పెట్టడం మానేస్తే బాగానే ఉంటుంది కానీ కంటిన్యూ చేస్తే మాత్రం ఆమె పోలీసుల వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో 'తానా', తెలుగులో 'అక్షర' అనే చిత్రాల్లో నటిస్తోంది.