మనకున్న అతి తక్కువ మంది మహిళా దర్శకురాళ్లలో నందినీ రెడ్డి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి సక్సెస్ రూటులో వెళ్తున్న ఆమె ప్రాజెక్టు మెటీరియలైజ్ చేసే విషయంలో ఆచి,తూచి అడుగులు వేస్తూంటారు. సమంతతో ఆమె దర్శకత్వం వహించిన టువంటి ఓ బేబీ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేగాక బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను వసూలు చేసి నందినిరెడ్డి కెరీర్లోనే బెస్ట్ చిత్రం గా నిలిచింది.

అయితే ఓ బేబి తర్వాత మరో సినిమా ఇప్పటిదాకా ఎనౌన్స్ చేయలేదు. దాంతో ఆమె ఫలానా సినిమా చేయబోతోంది. ఫలానా హీరోతో ప్రాజెక్టు మొదలెట్టబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. మిగతా డైరక్టర్స్ సంగతేమో కానీ ఆమె మాత్రం ఇలాంటి వార్తలపై వెంటనే స్పందిస్తూంటుంది.

'దర్బార్'తో అందరూ నష్టపోయారు.. దర్శకుడు షాకింగ్ కామెంట్స్!

తాజాగా ఆమె సాయి ధరమ్ తేజ సోదరుడు వైష్ణవ తేజ తో సినిమా చేయబోతోందనే వార్తలు వచ్చాయి. అయితే అవి కూడా ఆమె రూమర్స్ అని కొట్టిపారేసింది. అంతేకాదు..త్వరలో తనే స్వయంగా తన కొత్త సినిమా వివరాలు ప్రకటిస్తానని అంటోంది. ఇలా తనపై వార్తలు రాసే మీడియాపై చిన్న సెటైర్ కూడా వేసింది.

నందినీ రెడ్డి ట్వీట్ చేస్తూ.. “ నా మీద వచ్చే నెక్ట్స్ క్రియేటివ్ స్టోరీ కోసం ఎదురుచూస్తున్నాను. అలాగే నా సినిమా గురించిన రియల్ న్యూస్ అతి త్వరలో ప్రకటిస్తాను.” అంది.
 ఇంతకీ నందీనిరెడ్డిపై లేటెస్ట్ గా వచ్చిన రూమర్ ఏమిటంటే... ఆమె దర్శకత్వం వహించబోయే చిత్రానికి వైష్ణవ్ తేజ్ ఓకే చెప్పాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయి. ఈ చిత్రం బాలీవుడ్ లో మంచి హిట్ అయిన లవ్ స్టోరీకు తెలుగు రీమేక్. ఈ చిత్రానికి స్వప్న సినిమా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది.