సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఆయనపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఓ పక్క ఆయన అభిమానులు రజినీ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ఎప్పుడొస్తారా..? అని చూస్తుంటే.. మరోపక్క ఆయనపై విమర్శలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

ఒకప్పుడు రజినీకాంత్ స్నేహితుడైన దర్శకుడు భారతీరాజా సందర్భం దొరుకుతున్న ప్రతీసారి రజినీకాంత్ ని విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా రజినీకాంత్ నటించిన 'దర్బార్' సినిమాపై విమర్శలు చేశారు. సినిమా హీరోలు ఆడియో విడుదల వేడుకల్లో రాజకీయాలు మాట్లాడొద్దని భారతీరాజా అన్నారు.  

మరో రికార్డ్ బ్రేక్ చేసిన తలైవా.. దర్బార్ డబుల్ సెంచరీ!

'దర్బార్' ఫెయిల్యూర్ తో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు. రూ.50 కోట్ల సినిమాకి రూ.400 కోట్లు అని ప్రచారం చేయడం బాధాకరమంటూ 'దర్బార్' సినిమాకి తప్పుడు కలెక్షన్స్ చెబుతున్నారని నేరుగానే కామెంట్స్ చేశారు. నిజంగానే రూ.400 కోట్ల వ్యాపారం జరిగితే రూ.350 కోట్లు ఎవరి జేబుకి వెళ్లాయని ఆయన ప్రశ్నించారు.  

ఈ పరిస్థితి పరిశ్రమని నష్టాలపాలు చేస్తుందని.. డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు కొనేప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మురుగదాస్ డైరెక్ట్ చేసిన 'దర్బార్' సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై హిట్ టాక్ దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమాపై భారతీరాజా చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి.