నెట్‌ఫ్లిక్‌ వెబ్‌సిరీస్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌’ను ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న నందినీ రెడ్డి ఈ విషయమై గతంలో ఓ సారి క్లారిఫికేషన్ ఇచ్చారు.  ‘సబ్‌ టైటిల్స్‌ ఉన్న ‘లస్ట్‌ స్టోరీస్‌’ను రీమేక్‌ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకమ్మా... ఏంటో ఈ వెరైటీ రూమర్స్‌’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. సందీప్‌రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, సంకల్ప్‌రెడ్డి లతో పాటు నందినీరెడ్డి కూడా ఈ వెబ్ సీరిస్ ని  డైరెక్ట్ చేస్తున్నారు.

అసభ్యకర వీడియోలు చూపిస్తూ.. సీరియల్ నటి కామెంట్స్!

ఈ నేపధ్యంలో కొన్ని రూమర్స్ మీడియాలో మొదలయ్యాయి. ఇప్పటికే షూటింగ్ మొదలైపోయిందని..లస్ట్ స్టోరీస్ రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. దాంతో మరోసారి నందినీరెడ్డి సోషల్ మీడియాలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. మరోసారి చెప్తున్నా..ఆల్రెడీ హిందిలో ఉన్న లస్ట్ స్టోరీస్ లో కథలు ఏమీ తెలుగులో చేయటం లేదు. తాము వేర్వేరు కథలతో వస్తున్నామని, అవి లస్ట్ స్టోరీస్ కాదని అన్నారు. తాము సొంతంగా కథ, స్క్రిప్టు రాసుకుని తెరకెక్కిస్తుట్లుగా చెప్పుకొచ్చారు. అందుతున్న సమాచారం మేరకు ...ఒక్కొక్క ఎపిసోడ్ కు కోటిన్నర దాకా నెట్ ప్లిక్స్ వారు కేటాయించారని సమాచారం. ఆ కోటిన్నరలోనే రెమ్యునేషన్స్ నుంచి అన్ని ఖర్చులు కలిసి ఉండనున్నాయి.

ఇక హిందీలో 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలుసు. నాలుగు భాగాలుగా వచ్చిన ఈ సిరీస్‌కు నలుగురు పేరుపొందిన డైరెక్టర్లు.. అనురాగ్ కశ్యప్, జోయా అఖ్తర్, కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ డైరెక్ట్ చేశారు. రాధికా ఆప్టే, కియారా అద్వానీ, మనీషా కొయిరాలా, భూమి పెడ్నేకర్, విక్కీ కౌశల్ వంటి స్టార్లు అందులో నటించారు. ఈ సిరీస్ ఇప్పుడు తెలుగులో ఎవరితో చేయబోతున్నారో మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.

ఇక నందిని చిత్రాల విషయానికి వస్తే ...ఆమె కొత్త సినిమా కొన్ని రోజుల క్రితం ఖరారైంది. ప్రముఖ నిర్మాత అశ్వినిదత్‌ కుమార్తెలు స్వప్న, ప్రియాంక దీన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. నందిని రీసెంట్ గా ‘ఓ బేబీ’తో మంచి హిట్‌ అందుకున్నారు. సమంత టైటిల్‌ రోల్‌ పోషించిన ఈ సినిమా కొరియన్‌ సినిమా ‘మిస్‌ గ్రానీ’కి తెలుగు రీమేక్‌గా రూపొందింది.